జనసేన కు పోటీగా జేడీ కొత్త పార్టీ ? పేరు ఇదే ?

లక్ష్మీనారాయణ ఈ పేరు కంటే జేడీ లక్ష్మీనారాయణ అనే పదాన్ని తన ఇంటిపేరుగా మార్చుకుని పాపులర్ అయిన సి.బి.

ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నో ట్విస్ట్ ల మధ్య జనసేన పార్టీలో చేరారు.ఆ పార్టీలో చేరిన తరవాత ఆయనకు ఎక్కడాలేని ప్రాధాన్యం మొదట్లో దక్కేది.

ఇక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు.అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆయన ఆశలన్నీ ఆవిరయ్యాయి.

జనాలకు ఏదో చేద్దామనే ఆలోచన తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా పార్టీని ఏండ్చుకోవడంలో తాను రాంగ్ స్టెప్ వేసి ఇలా దెబ్బతిన్నానని, జనసేనలో చేరి తప్పు చేశానని అనేక సందర్భాల్లో ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి.

Jd New Party To Contest Janasena
Advertisement
Jd New Party To Contest Janasena-జనసేన కు పోటీగా జ�

  ఇక జనసేనకు రాజీనామా చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు లక్ష్మీనారాయణ.ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది అందరికీ ఉత్కంఠను రేపింది.ఆయన బిజెపి, టిడిపి ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరతారని అంతా భావించారు.

కానీ ఆయన మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనకు రావడంతో పాటు ఇప్పటికే పార్టీకి సంబంధించి పేర్లను కూడా రిజిస్టర్ చేయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఆ పార్టీ పేరు కూడా జనసేన కు దగ్గరగా ఉండేలా జన ధ్వని, జన ధ్రువ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఫైనల్ చేసి బహిరంగంగా ప్రకటించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Jd New Party To Contest Janasena

  ఈ పేరు పెట్టడం వెనుక కారణాలు చూస్తే జనసేన పార్టీలో చేరి అసంతృప్తితో బయటకు వచ్చిన వారికి, అలాగే ఎగువ, దిగువ, సామాన్య ప్రజలకు ఇది ఒక వేదిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అది కాకుండా పార్టీని ముందుగా క్షేత్రస్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్లి జనాల్లో బాగా ఫేమస్ అయ్యేలా చేయాలని చూస్తున్నారట.ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో బలోపేతం చేసి దిశగా జేడీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు అవసరం లేదని, సేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలు అనే విషయాన్ని తన పార్టీ ద్వారా నిరూపించాలని జేడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లోనే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...
Advertisement

తాజా వార్తలు