సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి మహేష్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్‌గా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని మహేష్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ క్రమంలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే అంశంలో చిత్ర యూనిట్ తెగ సతమతమవుతోందట.కాగా భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీని మరోసారి తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో మహేష్ సరసన రెండో హీరోయిన్‌గా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను తీసుకోవాలని డైరెక్టర్ అనుకుంటున్నాడట.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న నిధి అగర్వాల్, మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో ఆమెను ఈ విషయమై సంప్రదించారట చిత్ర యూనిట్.మహేష్‌తో సినిమా అంటే ఎవరు వద్దని అంటారు? అంటూ ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్రపురి టాక్.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్, ఇండియాకు తిరిగి రాగానే వంశీ పైడిపల్లి సినిమాను ప్రారంభిస్తాడు.