Ys sharmila Cm jagan : కాంగ్రెస్ నూ వదలని జగన్ .. షర్మిల దూకుడుకి బ్రేకులు ఇలా ?

అకస్మాత్తుగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.

అదే పనిగా తనను, తమ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న తన సోదరి వైఎస్ షర్మిల దూకుడు కు బ్రేకులు వేసే విధంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఎక్కడా షర్మిల పేరు నేరుగా ప్రస్తావించకుండానే, ఆమె ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని జగన్( YS Jagan Mohan Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు.అడ్డగోలుగా ఏపీని విభజించిన పాపం కాంగ్రెస్ దేనిని జగన్ ఫైర్ అవుతున్నారు.

ఏపీలో పూర్తిగా కనుమరుగైన కాంగ్రెస్ కు ఊపిరి పోసే విధంగా షర్మిల ప్రయత్నిస్తూ ఉండడం వంటి వాటిపై సీరియస్ గా ఉన్న జగన్, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ షర్మిల( Ys sharmila ) విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Ys Sharmila Cm Jagan : కాంగ్రెస్ నూ వదలని జగ

ఒక శాస్త్రీయత లేకుండా దారుణంగా 2014లో, ఏపీ కాంగ్రెస్( Ap congress ) ను విభజించిందని జగన్ గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు.కనీసం ప్రత్యేక హోదాను అయినా చట్టంలో పెట్టి ఉంటే కోర్టుకు వెళ్లైనా సాధించుకునేందుకు వీలుపడేదని జగన్ చెబుతున్నారు.కేవలం నోటి మాట ద్వారానే ప్రత్యేక హోదా అని చెప్పారని జగన్ విమర్శిస్తూ పదేపదే ఏపీకి ప్రత్యేక హోదా ఎక్కడ అంటూ తనపై విమర్శలు చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
Ys Sharmila Cm Jagan : కాంగ్రెస్ నూ వదలని జగ

హైదరాబాద్ వంటి నిధులు అందించే రాజధాని లేకపోవడం వల్ల ఏటా ఏపీ 13 వేల కోట్ల రూపాయలు నష్టపోతోందని , గత ఐదేళ్లలో చూసుకుంటే లక్ష 30 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని జగన్ లెక్కలతో సహా వివరిస్తున్నారు.

Ys Sharmila Cm Jagan : కాంగ్రెస్ నూ వదలని జగ

దేశంలో అనేక రాష్ట్రాలకు ఆర్థికంగా భరోసా నిధులు అన్ని రాజధానుల నుంచి వస్తున్నాయని, ఏపీకి అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.నిధుల కొరత వల్లే ఏపీ అప్పుల పాలు అవుతుందని జగన్ వివరిస్తున్నారు. కరోనా వంటి సంక్షోభాలను ఏపీ వంటి రాష్ట్రం తట్టుకోవడం కష్టం అయినా , తట్టుకున్నామని ,హక్కుల విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే తక్కువే చేశామని జగన్ వివరిస్తున్నారు.

తమ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అప్పుల వృద్ధిరేటు 12% గా ఉంటే.చంద్రబాబు ఐదేళ్ల అప్పు వృద్ధి రేటు 21 శాతం గా ఉందని జగన్ లెక్కలతో సహా వివరించారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు