తెలంగాణ సచివాలయంలో( Telangana Secretariat ) ధరణి కమిటీ సమావేశం( Dharani Committee Meeting ) ప్రారంభమైంది.స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం కొనసాగుతోంది.
టీఎస్ ఐఐసీని కూడా ధరణి కమిటీ ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరయిందని తెలుస్తోంది.కాగా ధరణి, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పలు సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిన తరువాత ధరణిపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ధరణిలో ( Dharani ) నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది.