ఎందుకు ఈ మౌనం జగన్ ? యాక్షన్ లోకి దిగొచ్చుగా ?

తాను మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90% హామీలను నెరవేర్చుకుని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును జగన్ సాధించారు.అన్ని విషయాల్లోనూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, ప్రజలు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు వారి అవసరాలు ఏమిటో గుర్తించి ముందుగానే వాటిని అమలు చేస్తూ జగన్ మంచి పేరు సంపాదించుకున్నారు.

పూర్తిగా పాలనాపరమైన విషయాలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు.కానీ ఈ సమయంలో పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి లేకపోతున్నారు.

దీనినే అదునుగా తీసుకున సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతున్నారు.జగన్ కు ఇది ఆగ్రహం కలిగిస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, అలా చేస్తే మరి కొంతమంది బయటకి వచ్చి గొంతు పెంచుతారని, అలాగే ప్రతిపక్షాలు కూడా దీనిని అవకాశంగా తీసుకుని, మాటలు దాడి మొదలు పెట్టే అవకాశం ఉందని జగన్ గ్రహించాడు.

Advertisement

అందుకే పార్టీలో అసంతృప్తి ఉన్న నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించి మౌనంగానే ప్రజా పరిపాలన లో నిమగ్నమయ్యారు.సొంత పార్టీ నాయకులు ఒక్కసారిగా ఇలా అసమ్మతి గళం వినిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

తాము ఎమ్మెల్యే, ఎంపీ గా ఉండడంతో నియోజకవర్గాల్లో తమ మాట చెల్లుబాటు కావాలని, ప్రతి పథకం తమ ప్రమేయం లేకుండా అమలవుతుండడం, లబ్ధిదారుల ఎంపిక, ఇలా అన్ని నిర్ణయాలను తీసుకోవడంలో తమ పాత్ర ఏమీ ఉండడం లేదని, మొత్తం అధికారులతోనే అన్ని కానిచ్చేస్తున్నారని, తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నామని, నాయకులుగా తమకు విలువ లేకుండా పోతోందని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమీ లేకుండానే, ప్రజలకు ఏం కావాలో అన్ని జరిగిపోతున్నాయి.

ఈ పరిణామాలు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై సానుకూలతను ఏర్పరచగా, సొంత పార్టీ నాయకుల్లో మాత్రం అసంతృప్తి గూడుకట్టుకునేలా చేస్తోంది.నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటివారు ఇప్పుడు చాలా మంది వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు.

ఈ సమయంలో జగన్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టి వారి ఇబ్బందులను తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు సూచించేలా వారికి భరోసా ఇవ్వగలిగితే అసంతృప్తులకు చెక్ పెట్టినట్లు అవుతుంది.అలా కాకుండా ఇప్పటికీ జగన్ మౌనంగానే ఉండిపోదామనుకుంటే, రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు