తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( Kangana Ranaut ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కంగనా సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.తరచూ ఈమె ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాలలోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అలాగే సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈమె ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొక పక్క రాజకీయాల్లో( Politics ) అడుగు పెట్టింది.

బీజేపీ( BJP ) అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం( Mandi Constituency ) నుంచి పోటీ చేసిన ఆమె 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.గెలిచినా అనంతరం ఆమె ఇలా చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజా సేవలోనే లీనమవుతాను అని ఆమె వెల్లడించింది.కానీ ఇటీవల చండీగర్హ్ విమానాశ్రమంలో ఎదురైనా సంఘటన తరువాత ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు.
ఓసారి నా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్( Sadhguru Jaggi Vasudev ) జీవిత సూక్తులను బోధించారు.తెలివైనవారు తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తారు.

కానీ, అవసరమైన పనిని చేసినవారే మేధావులు అవుతారు అని అన్నారు.అందుకే గురూజీ చూపిన మార్గాన్ని ఎంచుకున్నాను.రాజకీయాలపై ఆసక్తి లేకుంటే ఇన్ని కష్టాలను భరించాల్సిన అవసరం ఉండకపోయేది.రాజకీయాల నుంచి పిలుపు రావడం నాకు కొత్తేమీ కాదు.నా ఫస్ట్ సినిమా గ్యాంగ్‌స్టర్ రిలీజైన వెంటనే టికెట్ ఆఫర్ చేశారు.ఆ తర్వాత కూడా పలుసార్లు పాలిటిక్స్ లోకి రావాలంటూ ఆహ్వానాలు అందాయి.
మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆ సక్సెస్ ఉంది కనుకనే మమ్మల్ని పదేపదే పాలిటిక్స్ లోకి రమ్మని ఆహ్వానించేవారు.
నాతో పాటు మా నాన్నకు, చెల్లికి కూడా పిలిచేవారు కానీ సరైన టైం కోసం ఎదురు చూసాను అని చెప్పుకొచ్చింది కంగానా.అలా రాజకీయాల కంటే సినిమాలే బెటర్ అన్న విధంగా ఆమె కామెంట్లు చేయడంతో అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.