జగనన్నా కూసంత ఆలోచించరాదే!!!

రాజకీయం అంటేనే ఆకట్టుకునే కళ.అలాంటి కళ అందరికి రాదు.

అప్పట్లో అన్న ఎన్టీఆర్ ప్రజల గురించి తాను మాట్లాడే తీరు చూసి అందరూ ముగ్దులయ్యేవారు.

అంతేకాకుండా ఆ పెద్దాయన ఆ మాటలను మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో కూడా చేసి చూపించేవారు.

ఇక ఆ తరువాత వచ్చిన నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడేవారు.అందులో కేసీఆర్ గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే చెప్పడంలో.

వరాలు కురిపిస్తూ మాట్లాడడంలో ఆ పెద్దాయన తరువాత కేసీఆర్ ను మెచ్చుకోవచ్చు.ఇక చంద్రబాబు సైతం గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలిగే నేత కానీ ఆయన ప్రతీ మీటింగ్ లో వేదికపై మాట్లాడుతూ చెప్పింది చెబుతూ ఉంటారు.

Advertisement

అందులో ముఖ్యంగా రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు.హైదరాబాద్ ను బాగు చేసింది నేనే.

వంటి కొన్ని డైలాగులు.చంద్రబాబు కొన్ని వేల సార్లు చెప్పి ఉంటారు.

అయితే అదే పాటాన్ని ఇప్పుడు జగన్ సైతం అలవర్చుకున్నాడు.ఇప్పటికే ప్రతిపక్షంలో కూర్చొని 7నెలలు అయినప్పటికీ చంద్రబాబులా రుణమాఫీ చేస్తానని అబద్దం చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవాణ్ణి.

టీడీపీకి, వైసీపీకి 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా.అధికారంలోకి రాగానే ఆ పని చేస్తా.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!

ఈ పని చేస్తా.అన్న డైలాగులతో జనాలకు బోర్ కొట్టిస్తున్నారు.

Advertisement

మరి ఇప్పటికే జనాలు తన దగ్గర కంటెంట్ లేదని అందుకే చెప్పిందే చెబుతూ ఉన్నాడని అనుకుంటూ ఉండడంతో ఒకింత ఆలోచించి మాటల్లో మార్పును చేరిస్తే ఎంతో మేలు అని విశ్లేషకుల భావన.

తాజా వార్తలు