అల్లాడిపోతున్న తెలంగాణా నేతలు!!!

తెలంగాణా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.అందులో ముఖ్యంగా ప్రతీ నియోజకవర్గం అభివృద్ది చెందాల్సి ఉంది.

అయితే అలా అభివృద్ది చెయ్యాలి అంటే మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందే.కానీ తెలంగాణాలో ప్రతీ నియోజకవర్గంలోనూ ఆయా శాసన సభ్యులు అందరూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కునే పరిస్థితులు ఉన్నాయి.

నేతలు అందరూ నిధులు రాక అల్లాడుతున్నారు.ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడాలేకుండా పోయింది.

నియోజకవర్గ అబివృద్ది కోసం కోటి నుంచి కోటిన్నర ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకుజీతాలు పెంచుతామని, ఎమ్.పిలకు బత్యాలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.కాని ఇంతవరకు అవేవి అమలులోకి రాలేదని వాపోతున్నారు.

Advertisement

చివరికి టిఆర్ఎస్ నేత, ఛీప్ విప్ కొప్పుల ఈశ్వర్ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గాలలో అబివృద్దికి నిధులు ఒక్క రూపాయి లేకపోవడంతో ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రతిపక్షాల వాదన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.బిజెపి నేత కిషన్ రెడ్డి సైతం నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకపోవడంపై విమర్శలు సందించారు.మరోపక్క అధికారులు మాత్రం వింతగా బడ్జెట్ లో వేల కోట్ల నిధులు కేటాయించినా, ఆదాయం వస్తేనే కదా ఖర్చులకు ఇవ్వగలిగేదని సమాధానం ఇస్తున్నారు.35 వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ లో అంచనా వేస్తే పదహారు వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని , అందువల్ల ఏమి చేయగలుగుతామని వారు చెబుతున్నారు.ఏది ఏమైనా కేసీఆర్ దీనిపై ఒకింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు