రాజధాని సీక్రెట్ మాకు చెప్పండి - వైఎస్ఆర్సీపీ

రాష్ట్రం విడిపోవడం, రాజధాని ఏర్పడడం మాట దేవుడికి ఎరుక గాని ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మాత్రం ఆ వ్యవహారం రోజు రోజుకీ పెద్ద ఇబ్బందిగా మారిపోతుంది.

నిన్న మొన్నటి వరకు పంటలు తగల పెట్టించింది అధికార పక్షం వాళ్లే, అందుకే పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ వైకాపా ఆరోపణలు చేస్తూ వచ్చింది.

ఇప్పుడు తాజాగా మరో వ్యవహారాన్ని మెడలో వేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగానే రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం పర్యటన గురించి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు మొదలు పెట్టింది.

ముందస్తు సమాచారం లేకుండా.సింగపూర్ బృందం కామ్ గా పని పూర్తి చేసుకుంటుంది అని, ఆ వివరాలను సర్కార్లు పెద్దలు సైతం మీడియాకు ఇవ్వలేదు అని విమర్శలు సైతం వస్తూ ఉన్నాయి.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న రైతులు అడ్డుపడతారనే ఉద్దేశంతోనే.ముందు జాగ్రత్తగా ఈ పర్యటన వివరాలు సీక్రెట్ గా ఉంచారని వైకాపా వాదన.

Advertisement

అంతేకాకుండా సింగపూర్ సంస్థలకు చెందిన వారిని రాజధాని గ్రామాల్లో రహస్యంగా ఎందుకు తిప్పుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

భారతదేశంలో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఉండగా బాబుకు సింగపూర్ పైనే అంత ప్రేమ ఎందుకో చెప్పాలి అంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.మరి దీనిపై పసుపు పార్టీ ఏమైనా కౌంటర్ ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు