న్యాయస్థానం కూడా రద్దు చేస్తావా జగన్‌

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై హైకోర్టు చురకలు వేస్తూనే ఉంది.

రాజధాని మార్పు మరియు సీఆర్‌డీఏ రద్దు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఇంకా ప్రభుత్వ కార్యలయాలకు వైకాపా జెండా రంగు వేయడం వంటి నిర్ణయాలపై జగన్‌ ప్రభుత్వంకు హైకోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంకు మింగుడు పడటం లేదు.

ఈవిషయమై జనసేన స్పందించింది.మీరు తీసుకునే ప్రతి అనాలోచిత నిర్ణయాన్ని హైకోర్టు సరైనది కాదు అంటూ తప్పుబడుతుంది.

మీ నిర్ణయాలను తప్పుబట్టిన మండలిని రద్దు చేసేందుకు సిద్దం అయ్యారు.అసెంబ్లీలో తీర్మానం చేశారు.

ఇప్పుడు మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న హైకోర్టును కూడా మీరు రద్దు చేస్తారా జగన్‌ గారు అంటూ జనసేన అధికారిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోధ్యం కాని కారణంగానే ఇలాంటి తీర్పులు వస్తున్నాయంటూ ఈ సందర్బంగా జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు