వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలనాలే సృష్టిస్తూ వస్తున్నాడు.అసాధ్యం అనుకున్న కార్యక్రమాలను కూడా అమలు చేసి చూపిస్తూ డేరింగ్ సీఎంగా పేరుతెచ్చుకుంటున్నాడు.
ఇక జగన్ వ్యవహారశైలి విషయానికి వస్తే ఆయన విలాసాలకు అలవాటు పడ్డ వ్యక్తని, అందరితోనూ సఖ్యతగా ఉండరని ప్రచారం నడిచేది.అయితే ఇప్పుడు జగన్ వ్యవహారం చూస్తుంటే ఆ విషయాలన్నీ తప్పు అన్నట్టుగా తేలిపోతోంది.
జగన్ ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు.ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ తెచ్చుకుని మాట్లాడుతున్నాడు.
ప్రజలకు ఏది అవసరమో అదే ముందుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.అదే సమయంలో సీఎం అంటే జగన్ లా ఉండాలి అనేలా, ప్రజల్లో మంచి వ్యక్తి అనే గుర్తింపు సాధించాలని తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.
జగన్ గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన నిరాడంబరత అందరికీ తెలిసివచ్చింది.జగన్ ఎక్కడా అట్టహాసానికి ఆర్భాటానికి పోకుండా పూర్తిగా జనం మనిషిగానే కనిపిస్తున్నాడు.
ఇక జగన్ సీఎం అయిన తరువాత కూడా అదే తీరుతో కనిపిస్తున్నాడు.జగన్ ఆహారపు అలవాట్లు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి.
ఆయన ఎక్కువ తినరు.మాటల నుంచి ప్రతీ విషయంలోనూ అవసరం మేరకే అన్నట్లు పొదుపుగా ఉంటున్నారు.
తనతో ఉన్న వారికి కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది.
మధ్యాహ్నం భోజనంగా వచ్చింది చూసిన కొత్త మంత్రులు షాక్ తిన్నారట.ఎందుకంటే అది సాధారణమైన భోజనమాట.
అసలు సీఎం మీటింగ్ లో పెట్టే భోజనమంటే రకరకాల వంటకాలతో ఉంటాయనుకున్నారు.ఇక కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరిగింది.ఈ సమావేశంలోనూ జగన్ అలాగే సాధారణ భోజనం ఆర్డర్ చేశారట.తనకు కూడా అదే తెప్పించుకున్నారట.
అయితే ఇదంతా జగన్ ఎందుకు చేస్తున్నట్టు అని ఆరా తీస్తే ఖజానాకు భారం కాకూడదనే కారణంతోనే ఇలా చేస్తున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత ప్రభుత్వాలు కేవలం భోజనాల కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమర్శలపాలయ్యారని, ఏపీ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, ఇది విలసాలకు సమయం కాదని కూడా జగన్ భావిస్తుండడంతో ఈ విధంగా పొదుపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.