పిక్‌టాక్‌ : శ్రీముఖి బ్రేక్‌ ఎందుకు తీసుకుందో ఇప్పుడు అర్ధం అయ్యింది

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి అనగానే వెంటనే ఠక్కున గుర్తుకు వచ్చే షో ‘పటాస్‌’.యాంకర్‌ రవితో కలిసి చేసిన పటాస్‌ షో సూపర్‌ హిట్‌ అవ్వడంతో రష్మీ అనసూయ రేంజ్‌లో ఈ అమ్మడికి గుర్తింపు వచ్చింది.

 Srimukhi Looks Like Very Slim For Bigg Boss Telugu 3-TeluguStop.com

అలాంటి పటాస్‌ను ఈ అమ్మడు ఎందుకు వద్దనుకుంది, ఆమె ఎందుకు పటాస్‌ నుండి వైదొలిగింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే ఈమె బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కోసం ఎంపిక అయ్యింది.

అందుకే పటాస్‌కు బై చెప్పిందని తెలుస్తోంది.

పిక్‌టాక్‌ : శ్రీముఖి బ్రేక్‌

శ్రీముఖి పటాస్‌కు బై చెప్పి దాదాపు రెండు నెలలు అవుతుంది.అయినా ఇంకా కూడా బిగ్‌ బాస్‌ ప్రారంభం కాలేదు.బిగ్‌బాస్‌కు చాలా సమయం ఉన్నా కూడా ఎందుకు అప్పుడే పటాస్‌కు శ్రీముఖి బై చెప్పిందనే విషయమై చర్చ జరిగింది.

శ్రీముఖి బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు లావు తగ్గాలని భావించింది.అందుకోసం పటాస్‌కు రెండు నెలల ముందే బ్రేక్‌ తీసుకుంది.గత కొన్ని రోజులుగా కఠోర వర్కౌట్స్‌ చేసిన శ్రీముఖి ఎట్టకేలకు లావు తగ్గింది.ఈ రెండు నెలల్లో దాదాపుగా ఆరు కేజీల బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది.

పిక్‌టాక్‌ : శ్రీముఖి బ్రేక్‌

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన ఫొటోలను అప్‌లోడ్‌ చేసింది.ఆ ఫొటోల్లో కొత్తగా కనిపిస్తుంది.హాట్‌ లుక్‌తో పాటు స్లిమ్‌లుక్‌తో శ్రీముఖి ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.శ్రీముఖి కొత్త లుక్‌కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.బిగ్‌బాస్‌లో ఈ అమ్మడు తన గ్లామర్‌తో రచ్చ చేయడం ఖాయం అంటూ బుల్లి తెర వర్గాల వారు భావిస్తున్నారు.

మరో రెండు వారాల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube