అమిత్‌ షాకు భారీ సవాల్‌ విసిరిన జగన్‌.. తెర వెనుక ఏం జరిగిందో చూడండి!

ఏపీలో జగన్‌ గెలవడానికి బీజేపీ పరోక్ష సాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇప్పుడదే బీజేపీ, ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షాకు మింగుడు పడని నిర్ణయాలతో జగన్‌ ఆశ్చర్యపరుస్తున్నారు.

తన మెడపై సీబీఐ కేసులు వేలాడుతున్నా జగన్‌ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌కు హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

అదేంటో ఒకసారి చూద్దాం.

Jagan Gave The Big Challenge To Amith Shah Whats Going On Behind

జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో స్టీఫెన్ రవీంద్ర అనే అధికారిని తెలంగాణ నుంచి తెచ్చుకొని ఇంటెలిజెన్స్‌ చీఫ్ పదవి అప్పగించడానికి జగన్‌ ప్రయత్నించారు.కానీ కేంద్రం అందుకు అనుమతించలేదు.దీంతో ఇప్పుడా కేంద్ర బీజేపీ పెద్దలకు అస్సలు పడని మనీష్‌ శర్మ అనే అధికారికి అదే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవిని జగన్‌ కట్టబెట్టారు.

Advertisement
Jagan Gave The Big Challenge To Amith Shah Whats Going On Behind-అమిత�

రాష్ట్రంలో డీజీపీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇది.ఈ మనీష్‌ శర్మ ఎవరో కాదు.గతంలో సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా మధ్య వచ్చిన విభేదాలపై విచారణ జరిపిన అధికారి.

ఒకప్పుడు అమిత్‌ షాకు దగ్గరి వ్యక్తిగా పేరున్నా ఈ వివాదంలో మాత్రం అలోక్‌ వర్మకు మద్దతిచ్చారు.దీంతో ఈ మనీష్‌ శర్మతోపాటు వర్మకు మద్దతిచ్చిన వాళ్లపై బదిలీ వేటు వేశారు.

Jagan Gave The Big Challenge To Amith Shah Whats Going On Behind

అలా ఈ మనీష్‌ శర్మ నాగపూర్‌కు వచ్చారు.ఆ తర్వాత కూడా కేంద్ర భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.దీంతో మనీష్‌ను కేంద్ర సర్వీసుల నుంచి తన సొంత కేడర్‌ అయిన ఏపీకి పంపించారు.

అమిత్‌ షాకు అస్సలు పడని అదే మనీష్‌ శర్మకు ఇప్పుడు జగన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవి ఇచ్చి సవాలు విసిరారు.దీనిపై కేంద్ర పెద్దలు గుర్రుగా ఉన్నారని తెలియగానే వివరణ ఇచ్చుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్లారన్న వార్తలు వచ్చాయి.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
పీఎఫ్ ఖాతా డబ్బులను ఏటీఎం నుంచే విత్‌డ్రా! త్వరలోనే అందుబాటులోకి!

అయితే మనీష్‌కు అంతటి కీలక పదవి ఇవ్వడం మింగుడు పడని అమిత్‌ షా.జగన్‌కు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అవమానించారని వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఎన్నికల ముందు చంద్రబాబుకు చెక్‌ పెట్టడానికి రహస్యంగా చేతులు కలిపిన బీజేపీ, వైసీపీ మధ్య క్రమంగా దూరం పెరుగుతున్నట్లు తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది.

Advertisement

తాజా వార్తలు