చనిపోయేవరకు ఆ కష్టాలు వదలవేమో.. కృష్ణవంశీ మోసం.. జబర్దస్త్ జీవన్ సంచలన వ్యాఖ్యలు!

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో జబర్దస్త్ జీవన్ ఒకరు.

జబర్దస్త్ జీవన్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయితే తర్వాత రోజుల్లో అనారోగ్య సమస్యల వల్ల జబర్దస్త్ జీవన్ ఈ షోకు దూరం కావాల్సి వచ్చింది.తాజాగా ఒక షోకు హాజరైన జీవన్ తన కన్నీటి కష్టాల గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

Jabardast Comedian Jeevan About His Hurdles Details Here Goes Viral In Social Me

ఒక పేరు వచ్చిన తర్వాత నా కష్టాలకు చెక్ పడుతుందని అనుకున్నానని జీవన్( Comedian Jeevan ) పేర్కొన్నారు.కానీ పేరు వచ్చిన తర్వాత కూడా కష్టాలు కొనసాగుతున్నాయని జబర్దస్త్ జీవన్ వెల్లడించారు.మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే ఆలోచనతో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని జీవన్ తెలిపారు.

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మహాత్మ సినిమాలోని నీలపూరి గాజుల ఓ నీలవేణి సాంగ్ ను మేమే పాడామని ఆయన అన్నారు.ఆ పాటను మేము పాడామని ఎక్కడా పేరు వేయలేదని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement
Jabardast Comedian Jeevan About His Hurdles Details Here Goes Viral In Social Me

కృష్ణవంశీ( Krishna Vamsi ) మోసం చేశారని పరోక్షంగా జీవన్ కామెంట్లు చేశారు.అక్కడ స్ట్రక్ అయిపోయానని ఆ తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడని జీవన్ తెలిపారు.

జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు వచ్చినా దేవుడు నాపై కరుణ చూపలేదని జీవన్ కామెంట్లు చేశారు.దేవుడు నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడని జీవన్ వెల్లడించారు.

Jabardast Comedian Jeevan About His Hurdles Details Here Goes Viral In Social Me

చిన్నప్పటి నుంచి నాకు అన్నీ కష్టాలేనని జీవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.జబర్దస్త్ జీవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్( Social media ) అవుతున్నాయి.జబర్దస్త్ జీవన్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జబర్దస్త్ జీవన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.జీవన్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు