సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన ఈటల రాజేందర్..!!

ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు చేయటంలో దూకుడు పెంచారు.

ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తనపై అనవసర భూ కబ్జా ఆరోపణలు రావటంతో పాటు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ ఇటీవల కమలాపూర్ మండల్ కేంద్రంలో బిజెపి పార్టీ నేతలతో మరియు కార్యకర్తలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహారశైలిపై విమర్శల వర్షం కురిపించారు.

Itala Rajender Criticizes CM KCR Etala Rajender,kcr , Ts Poltics , Bjp , Trs , H

కేసిఆర్ వ్యవహారశైలి ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ్డు ఎక్కిన తర్వాత బోడ మల్లన్న తరహాలో పరిస్థితి మారిందని విమర్శించారు.అధికారం రావడం కోసం ఎంతటి దారుణాన్ని కైనా కేసీఆర్ రెడీ అవుతారని విమర్శించారు.

కానీ హుజురాబాద్ ప్రజల ముందు కెసిఆర్ చిల్లర రాజకీయాలు పనికిరావని డబ్బులిచ్చి అదేవిధంగా కుట్రలు చేసినా గాని ఇక్కడ ఎవరూ లొంగరు అని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.తెలంగాణా ఆత్మ గౌరవం పట్ల హుజురాబాద్ ప్రజలు ఎంతగానో విలువ ఇస్తారు అని ఎవరికీ అమ్ముడుపోయే రకం కాదని ఈటల స్పష్టం చేశారు.

Advertisement

ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో మరో ఆరు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రజలను అప్రమత్తం చేస్తూ బీజేపీ పార్టీ నేతలను ఏకం చేస్తూ ఈటెల తనదైన శైలిలో నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.కెసిఆర్ ని గట్టిగా టార్గెట్ చేసి మరి ఈటల వ్యవహరిస్తున్నారు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు