ధన్‌తేరాస్ రోజున కొన్న కొత్త పాత్రలతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం మంచిది కాదా..

దీపావళి పండుగను చెడుపై మంచి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.

సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగకు ముందు వచ్చే ధన్‌తేరాస్ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఈ రోజున ధన్వంతరి పూజను భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరు అనారోగ్య సమస్యలకు దూరం అవుతారు.ముఖ్యంగా ఇలాంటి మంచి రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం సాంప్రదాయంగా వస్తూ ఉంది.

ఇది అత్యంత శుభమని కూడా మన పూర్వీకులు నమ్ముతారు.చాలామంది ప్రజలు బంగారం, వెండి వస్తువులను కొంటూ ఉంటారు.

ఆ వస్తువులకు పసుపు, కుంకుమ పుసి అమ్మవారి పాదలో చెంత ఉంచుతారు.ఇలా చేయడం వల్ల ఇంటిలో అదృష్టం వస్తుందని ఆ ఇంటి వారికి శుభమే జరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు.

Advertisement

అయితే ఈ పవిత్ర దినాన ఇంట్లోకి ఖాళీ చేతులతో రాకూడదు.మీరు కూడా ధనత్రయోదశి రోజున కొత్త పాత్రలు బంగారు, వెండి నాణేలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వాటిని తీసుకుని ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మూడు వస్తువులలో ఒకదాన్ని మీ వద్ద ఉంచుకోవడం మంచిది.

ఇలాంటి రోజుల్లో ఖాళీ పాత్రలను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించడం అశుభంగా భావిస్తారు.కాబట్టి గృహప్రవేశం సమయంలో కచ్చితంగా ఉండవలసిన మూడు విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మీరు పాత్రలు కొంటున్నట్లయితే, ధనత్రయోదశి రోజున మీరు ఒకటి కాదు రెండు పాత్రలు కొనుగోలు చేసి రెండింటిలో నీరు,స్వీట్లతో నింపడం మంచిది.ఒక దానిని ధనత్రయోదశికి కోని, మరొకటి దీపావళి నాడు లక్ష్మీ-గణేశ పూజ కోసం కొనాలి.ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కోని ఇంట్లోకి వచ్చేటపుడు మిఠాయిలు తప్పనిసరిగా ఉంటే మంచిది.

ధనత్రయోదశి రోజున మీరు షాపింగ్ చేసి ఇంటికి రాగానే ఏడు రకాల ధాన్యాలు తెచ్చుకుంటే మీ ఇంటికి అన్నం, ఐశ్వర్యం, అదృష్టం లాంటి వన్నీ వస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు