సుమ క్యాష్ కార్యక్రమంలో తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదేనా?

బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని కొనసాగుతున్న కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి.

ఇక గత ఎపిసోడ్ తో ఈ కార్యక్రమం 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.

ఇలా 200 ల ఎపిసోడ్ పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి ఎఫ్ 3 చిత్ర బృందం హాజరయ్యారు.ఈ క్రమంలోనే హీరోయిన్స్ సోనాల్ చౌహాన్, తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు సునీల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరి చేత ఎప్పటిలాగే ఫన్ క్రియేట్ చేశారు.వీరితో కలిసి పలు రకాల టాస్క్ లను నిర్వహించారు.

అయితే గతవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు.అయితే తమన్నా ఈ కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ హీరోయిన్ సోనాల్ చౌహాన్, తమన్నాతో ఒక టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా సుమ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మహానటి సావిత్రి లాగ ఎడమ కంటి నుంచి కన్నీళ్ళు కార్చాలని సుమ చెప్పారు.ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా సుమ తమన్నాను ప్రశ్నిస్తూ.

వీరిద్దరిలో మీరు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారని ప్రశ్నిస్తూ ఆప్షన్ ఏ ఎన్టీఆర్, ఆప్షన్ బి అల్లు అర్జున్ అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెప్పలేక మహానటి సావిత్రి మాదిరిగా ఎడమ కంటి నుంచి కన్నీళ్లను కార్చారు.

ఇలా తమన్నా ఏడవటాన్ని ప్రోమోలో హైలెట్ చేసి ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు