Alia Bhatt: అలియా భట్ పెళ్లి చీర కట్టుకొని నేషనల్ అవార్డు తీసుకోవడానికి అసలు కారణం ఇదేనా..?

బాలీవుడ్ నటి అలియా భట్ ( Alia Bhatt ) ఈ మధ్యకాలంలో నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు( National Award ) అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమయంలో పెళ్లి చీరలో వచ్చి ఆ అవార్డు అందుకుంది.

ఇక ఆ సమయంలో అందరూ అలియా భట్ ఏంటి అలా పెల్లి చీర లో వచ్చి అవార్డు అందుకుంది.అసలు కారణం ఏంటి అని చాలామంది ఆరా తీశారు.

కానీ అసలు విషయం మాత్రం బయటపడలేదు.అయితే తాజాగా అలియా భట్ తాను పెళ్లి చీర కట్టుకొని ( wedding saree )ఎందుకు అవార్డు తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని బయట పెట్టింది.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్ పాల్గొని మాట్లాడుతూ.

నేను నేషనల్ అవార్డు తీసుకునేటప్పుడు పెళ్లి చీరలో వెళ్లాను.దానికి కారణం అలాంటి గొప్ప ఈవెంట్లో ఈ ప్రత్యేకమైన చీర కట్టుకోవడమే నాకు బెటర్ అనిపించింది.

Advertisement

అయితే కొంత మంది అలాంటి గొప్ప గొప్ప ఈవెంట్లలో చాలా స్పెషల్ గా కనిపించాలి అనుకుంటారు.కానీ నాకు మాత్రం పెళ్లి చీరే ముందుగా గుర్తుకొస్తుంది.

అది కట్టుకోగానే నాకు వేరే ఏవి గుర్తుకు రావు.

ఏదో తెలియని ఆనందం నా లోపల కలుగుతుంది.అలాగే దానిపై నగలు కూడా అవసరం లేదు అనిపిస్తుంది.కానీ మనం వేసుకునే డ్రెస్ లో కాదు వాటిని వేసుకునే మనుషులు ముఖ్యం అంటూ అలియా భట్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అలియా భట్ పై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ.నా పెళ్లి విషయంలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి కానీ ఆ సమయంలో నేను అన్నింటి గురించి ఆలోచించి ఎంతగానో ఇబ్బంది పడ్డాను.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

కానీ ఇప్పుడిప్పుడే వాటి నుండి బయట పడుతున్నాను.ఇప్పటినుండి వాటిని పట్టించుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను.ఇక మనం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు.

Advertisement

అయితే ఆ విషయాలు నాకంట ప్రతిసారి పడుతూ ఉంటాయి.కానీ నేను పట్టించుకోను నా సినిమాలు చూసే వాళ్లు జనాలే కాబట్టి అందుకే వాటిపై స్పందించడం లేదు అంటూ అలియా భట్ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు