గుప్పెడంత మనసు రిషి నిజజీవితంలో ఇంత విషాదం ఉందా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండేది.

ఎన్నో రియాలిటీ షోలు వచ్చిన ఎన్నో సీరియల్స్ వచ్చిన కార్తీకదీపం స్థానాన్ని మాత్రం ఏవి బీట్ చేయలేక పోయాయి.

అయితే గత కొద్ది రోజుల నుంచి కార్తీకదీపం సీరియల్ కి గుప్పెడంత మనసు సీరియల్ గట్టి పోటీ ఇస్తోంది.ఇక ఈ సీరియల్ ఈ మధ్యకాలంలో మంచి రేటింగ్స్ సొంతం చేసుకుని ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.

ముఖ్యంగా ఈ సీరియల్ ఇగో మాస్టర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రిషి .ఈ సీరియల్ లో రిషి, వసుధార ప్రేమలో మునిగితేలుతున్నారు.ఇక ఈ సీరియల్ లో రిషి తల్లిని అసహ్యించుకునే కొడుకు పాత్రలో కనిపిస్తూ, తండ్రిని ఎంతో ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు.

ఈ విధంగా సీరియల్లో తండ్రిపై ఎంతో ప్రేమను చూపించే కొడుకుగా ఏ విధంగా అయితే నటించారో, నిజ జీవితంలో కూడా తన తండ్రికి తానే తండ్రిగా మారి సేవలు చేస్తున్న విషయాలను వెల్లడించారు.ఇటీవల స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో స్టార్ పరివార్ అవార్డు వేడుకలో భాగంగా తన తండ్రిని పరిచయం చేశారు రిషి అలియాస్ ముఖేష్ గౌడ్.

Advertisement

గత కొన్ని సంవత్సరాల నుంచి తన తండ్రి పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యారు.

ఈ విధంగా పక్షవాతంతో బాధపడుతున్న తన తండ్రికి అన్ని తానే సేవలు చేస్తూ.అన్నం తినిపిస్తూ కంటికి రెప్పల కాపాడుతూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని రిషి చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే రిషి మాట్లాడుతూ.

మా నాన్నను నాకే పుట్టిన కొడుకులా భావిస్తున్నాను.అందరి జీవితంలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ నా జీవితంలో మాత్రం మా నాన్నకు నేను నాన్న కావడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఈయన తన తండ్రిపై ఉన్న ప్రేమను కురిపించారు.

ఇలా తండ్రి పట్ల రిషి చూపిస్తున్న ప్రేమకు అక్కడున్న వారంతా కాస్త ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు