బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది.
ఇకపోతే ఈ కార్యక్రమం మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే మల్లెమాల వారు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో సందడి చేసే కమెడియన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం టీం లీడర్లుగా ఉన్నటువంటి కొందరు కమెడియన్స్ ఒకప్పుడు స్కిట్లలో చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్లుగా మారిపోయారు అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో నూకరాజు, ఇమ్మానుయేల్ వంటి కమెడియన్లు ఎంతో అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నారు.
ఇక వీరిద్దరూ కమెడియన్లుగా జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చి కూడా చాలా కాలం అవుతుంది అయినప్పటికీ వీరు టీం లీడర్స్ గా మారకుండా ఇంకా కమెడియన్స్ గానే కొనసాగుతూ ఉన్నారు.ఇలా వీరిద్దరూ టీం లీడర్స్ కాకపోవడానికి ఏదైనా కారణం ఉందా అనే విషయానికి వస్తే…
నూకరాజు ఇమ్మానుయేల్ వంటి వారు టీం లీడర్స్ కాకపోవడానికి మల్లెమాల వారే కారణం అని తెలుస్తుంది.ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం ముందు అనుకున్న స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోతోంది ఈ కార్యక్రమానికి కాస్త రేటింగ్ తగ్గడంతో నిర్వాహకులు సైతం ఉన్న టీం మెంబెర్స్ కి రెమ్యూనరేషన్లు తగ్గించడం అలాగే ఈ కార్యక్రమప్రసార సమయాన్ని కూడా కాస్త తగ్గిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే వీరిద్దరిని టీం లీడర్ గా మార్చితే మరింత అదనపు భారంమల్లెమాల వారిపై పడే అవకాశం ఉంది అందుకే వీరికి ఇంకా టీం లీడర్స్ గా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.