ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

ఏ క్రీడలో అయినా సరే.ప్రతి ఒక్క క్రీడాకారుడు తన దేశానికి పతకలను సాధించి ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకొని ఆటలను ఆడుతూ ఉంటారు.

ఇక ముఖ్యంగా ఒలంపిక్స్( Olympics ) లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడు వారి దేశానికి పథకాన్ని సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇక ఈ సంవత్సరం ఒలంపిక్స్ జూలై 26, 2024 నుంచి ప్రారంభమవుతున్న సంగతి అందరికీ తెలిసింది.

పారిస్ ఒలంపిక్స్( Paris Olympics 202 ) లో దాదాపు 208 దేశాల నుంచి 10 వేలకు పైగా మంది అథ్లెట్లు పతకలు సాధించాలని పోటీ పడుతూ ఉండడం విశేషం.అలాగే ఈ సంవత్సరం ఒలంపిక్స్ లో మొత్తం 5084 పతకాలను క్రీడాకారులు అందుకోబోతున్నారు.

ఇక వాస్తవానికి ఈ పతకలను ఏ దానితో తయారుచేస్తాయి అంటే.బంగారం, వెండి, కాంస్య (రాగి).అలాగే అవి ఎంత మోతాదులో ఉపయోగిస్తారన్న విషయానికి వస్తే.

Advertisement

వాస్తవానికి ఒలంపిక్స్ బంగారు పతకంలో ఉపయోగించేది పూర్తిగా బంగారు కాదు.ఈ బంగారు పతకంలో కొంత మొత్తంలో మాత్రమే బంగారు ఉంటుంది.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ( International Olympic Committee )నిబంధనల ప్రకారం., బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5 శాతం వెండిని కలిగి ఉండి., 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో పూత పూయాలి.

అదేవిధంగా తక్కువ ఖర్చు కారణంగా వెండి పతకాలు పూర్తిగా వెండితో, కాంస్య పతకాలను స్వచ్ఛమైన కాంస్యం (రాగి)తో తయారు చేస్తారని తెలుస్తోంది.

ఇక ఒలింపిక్ కమిటీ అన్ని పతకాల పరిమాణం, బరువును కూడా సెట్ చేసింది.దీని కింద పతకాల పరిమాణం 85mm కాగా.మందం 9.2mm గా ఉంటుంది.అదే విధంగా బంగారు పతకం మొత్తం బరువు 529 గ్రా.

వీడియో వైరల్‌ : ఇదేందయ్యా ఇది.. బస్సుపై కాకులు టూర్ ప్లాన్ చేశాయా ఏంటి..?
వావ్, దాదాపు 60 ఏళ్ల వయసున్నా.. యువకుడి లాగా కనిపిస్తున్నాడే..??

లు, వెండి పతకం 525 గ్రా.లు, కాంస్య పతకం బరువు 455 గ్రా.

Advertisement

లు ఉంటుంది.ఈ సంవత్సరం 19వ శతాబ్దపు చారిత్రక ప్రదేశం ఈఫిల్ టవర్ నుండి ఓ ఇనుప ముక్కను తీసుకొని కూడా పారిస్ ఒలింపిక్స్ పతకాలలో పొందుపరచబడిందని సమాచారం.

తాజా వార్తలు