త్రివిక్రమ్ దర్శకత్వం లో సునీల్ హీరో గా మిస్ అయిన సూపర్ హిట్ చిత్రం అదేనా..?

సినిమాల మీద పిచ్చితో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఒక్క అవకాశం దక్కితే బాగుండును అని అనుకున్న స్నేహితులు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) మరియు సునీల్.

భీమవరం నుండి సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి వచ్చిన ఈ ఇద్దరు పంజాగుట్ట లో ఒక రూమ్ తీసుకొని ఉండేవారు.

స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగి తిరిగి, తమ వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడం తో ఆకలి తో అలాగే బ్రతికిన రోజులవి.అలాంటి స్థాయి నుండి ఇప్పుడు ఈ ఇద్దరు ఏ స్థానం లో ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం.

సునీల్ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కమెడియన్స్ లో ఒకరిగా మారాడు.ఆ తర్వాత హీరో అయ్యి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు.

ఇప్పుడు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా మారిపోయాడు.

Advertisement

ఇక త్రివిక్రమ్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ టాప్ 3 స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటాడు.ఇద్దరిలో ఒకరు నటుడిగా, ఒకరు దర్శకుడిగా ఉన్నత స్థాయిలో ఉన్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో సునీల్ కమెడియన్ గా నటించాడు.అయితే త్రివిక్రమ్ అప్పట్లో సునీల్ ని హీరో గా పెట్టి ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాడట.

హీరో గా సునీల్( Sunil ) గొప్పగా రాణిస్తున్న సమయం లో, త్రివిక్రమ్ ఆయనతో బంతి అనే చిత్రం చేద్దాం అనుకున్నాడట.బంతి అనే పాత్ర నువ్వు నాకు నచ్చావ్( Nuvvu Naaku Nachav ) అనే చిత్రం లో చేసాడు సునీల్.

ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, కమెడియన్ గా సునీల్ కి లైఫ్ ఇచ్చింది.అదే క్యారక్టర్ పేరుతో త్రివిక్రమ్ సునీల్ కోసం ఒక కథ ని సిద్ధం చేసాడట అప్పట్లో.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

కానీ త్రివిక్రమ్ వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ రావడం, సునీల్ కి హీరో గా అవకాశాలు మెల్లగా తగ్గిపోవడం జరిగింది.ఆ సమయం లో బంతి చిత్రం చేసి సునీల్ కి హీరో గా మైలేజ్ ని పెంచే ప్రయత్నం త్రివిక్రమ్ చేసి ఉండొచ్చు.కానీ ఆయన ఎందుకో చెయ్యలేకపోయాడు.

Advertisement

కానీ ఆయన తీసే సినిమాల్లో మాత్రం సునీల్ కి మంచి క్యారెక్టర్స్ రాస్తూ వచ్చాడు.ఇప్పుడు సునీల్ పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

త్రివిక్రమ్ పరిస్థితి కూడా ప్రస్తుతం అదే.కాబట్టి ఈ బంతి అనే ప్రాజెక్ట్ ఇక లేనట్టే అనుకోవచ్చు.

తాజా వార్తలు