ఆ నంది విగ్రహం నిజంగానే పెరుగుతోందా?

మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు, వింతలు, వినోదాలకు కూడా నెలవు.సాధారణంగా చెట్లకు జీవం ఉంటుందని మనకు తెలిసిన విషయమే.

కానీ రాళ్లకు కూడా జీవం ఉంటుందా? సాధారణంగా చెట్లు, మనుషుల మాదిరిగానే రాళ్ళు కూడా పెరుగుతాయా? ఇలాంటి ఎంతో విచిత్రమైన ప్రశ్నలు కొన్నిసార్లు తలెత్తుతుంటాయి.రాళ్లకు జీవం ఉందా అన్నదానికి.

నిదర్శనంగా యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర ఆలయానికి వెళితే ఇది నిజం అనే చెబుతారు.కర్నూల్ జిల్లా యాగంటి గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.

ఈ ఆలయం లో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.పూర్వం ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు.

Advertisement
Mystery Of The Growing Nandi Yaganti Uma Maheswara Swamy Temple, Nandi Growing,

కానీ ప్రస్తుతం అక్కడ ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా మొత్తం నంది విగ్రహం పెరిగి పోయింది.అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదు.

ఆలయ నిర్మాణం తరువాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Mystery Of The Growing Nandi Yaganti Uma Maheswara Swamy Temple, Nandi Growing,

ఈ నంది పై భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడ్డాయి.20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పెరుగుదల కనిపిస్తుందని, అది కేవలం ఒక ఇంచు మాత్రమే పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.సాధారణంగా రాళ్ళల్లో కొన్ని రసాయనాలు ఉండటం వల్ల, అది వర్షం తో చర్య జరిగి వాటి పెరుగుదలకు తోడ్పడతాయి.

కానీ నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో వర్షానికి తడవ కుండా కేవలం గాలిలో ఉండే తేమతో చర్య జరపడం వల్ల పెరుగుదల చాలా ఆలస్యంగా జరుగు తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.కాలజ్ఞానం లో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగం అంత మయ్యేటప్పుడు ఈ నంది లేచి రంకెలు వేస్తుందని తెలిపారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

అప్పుడే కలియుగం కూడా అంతం అవుతుందని తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ ఉన్న నంది రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

Advertisement
" autoplay>

తాజా వార్తలు