తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది .కొత్త ఏడాదిలో భారీగా మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది.
ఈ ప్రక్షాళన ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )ను మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇన్చార్జిలను మార్చేందుకు చూస్తోంది .ముఖ్యంగా తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్చార్జిని సైతం మార్చే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ సంక్రాంతి తరువాత దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనుందట .కేరళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దీపా దాస్ మున్షీ ( Deepa Das Munshi )ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్ గా పనిచేశారు .లోక్ సభ ఎన్నికల సమయంలో కేరళతో పాటు, తెలంగాణ ఇన్చార్జిగా ఆమెకు అదనపు బాధ్యతలను అప్పగించారు .అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపా దాస్ మున్షీ కీలకంగా వ్యవహరించారు.
తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఆమెకు ఉంది .వీటన్నిటిని లెక్కలు వేసుకునే అధిష్టానం దీపాదాస్ మున్సి కి అదనపు బాధ్యతలు అప్పగించింది.అయితే ఇటీవల కాలంలో దీపా దాస్ తీరుపై సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి పెరగడం, ఏకపక్ష నిర్ణయాలతో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేసేందుకు అవకాశం ఇస్తుంది .ఇక పార్టీలో చేరికలపైన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని , నేతలకు పదవులు విషయంలోనూ ఆమె నిర్ణయాలు సరిగా ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యేలు , రాష్ట్ర నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట .ఇక రాష్ట్ర నాయకులపై దీపా దాస్ మున్షీ బహిరంగంగానే విమర్శలు చేయడం పైన పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈనెల 18 తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి స్థానంలో మరో నేతను నియమించాలని అధిష్టానం నిర్ణయించుకుందట. దీంతో దీపా దాస్ మున్షీ స్థానంలో ఎవరిని నియమిస్తారు అనే విషయం పైన ఆసక్తి నెలకొంది .ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బగెల్ ( Chief Minister Bhupesh Bagel ), రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్,( Former Rajasthan CM Ashok Gehlot ) జయరాం రమేష్ పేర్లను పరిశీలిస్తున్నారట .వీరిలో అధిష్టానం ఎవరిని ఇన్చార్జిగా నియమిస్తుందో తేలాల్సి ఉంది. దీంతోపాటు తెలంగాణకు కొత్త పిసిసిని నియమించి వంద రోజులు దాటుతున్నా ఇంకా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం తో , కొత్త ఇన్చార్జి వచ్చాక పిసిసి కార్యవర్గ మార్పు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy