భార్య తల నరికి చేతిలో పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్న భర్త.. వీడియో చూస్తే గుండె జల్లుమనడం ఖాయం

ఇరాన్ దేశంలో చోటు చేసుకున్న ఒక భయంకరమైన ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది.

తాజాగా ఒక వ్యక్తి తన భార్య తల నరికి ఆ తలను తన చేత పట్టుకుని వీధుల వెంట తిరుగుతూ తన రాక్షస ఆనందాన్ని కనబరిచాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.ఇరాన్ దేశంలో మోనా హీదారీ (17) అనే యువతి తన భర్తతో కలిసి నివసిస్తోంది.

ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.అయితే కొంతకాలం పాటు వీరి వైవాహిక బంధం ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీ గానే సాగింది.

Advertisement

కానీ ఈ నేపథ్యంలోనే అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ విషయం భర్తకు తెలియడంతో భయపడిపోయిన సదరు భార్య టర్కీ దేశానికి పారిపోయింది.

అయితే ఆమెను వెతికి మళ్లీ ఇరాన్ దేశానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.దీంతో ఆమెపై తీవ్ర కోపం పెంచుకుని భర్త మర్డర్ చేయాలనుకున్నాడు.

ఇందుకు తన సోదరుడితో కలిసి తన భార్యను కసితీరా కత్తితో పొడిచి చంపేశాడు.అనంతరం భార్య తలను చేత పట్టుకొని వీధుల వెంట తిరుగుతూ బీభత్సం సృష్టించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో మనం ఒక వ్యక్తి నరికేసిన తన భార్య తలను పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఉండటం చూడవచ్చు.ఈ భయంకరమైన దృశ్యాలను చూసి స్థానికులు అరుపులు, కేకలతో ఊరుకులు పరుగులు తీయడం కూడా గమనించవచ్చు.అయితే అంతకుడు, భర్త మాత్రమే బెరుకు లేకుండా నవ్వుతూ కనిపించాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

ఒక చేత్తో కత్తి పట్టుకొని మరింత భయానక వాతావరణాన్ని సృష్టించాడు.ఈ భయంకరమైన వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు