Arya Sukumar : ఆర్య కోసం సుకుమార్ ఎన్ని క్లైమాక్స్ లు రాసుకున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రతిభను చూపిస్తూ వస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో సుకుమార్( Sukumar ) లాంటి దర్శకుడు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుతున్నాడు.

అయితే ఆర్య సినిమా( Arya Movie )తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వస్తున్నాడు.అయితే ఆర్య సినిమాలో క్లైమాక్స్ కోసం మూడు వర్షన్ లను రాసుకున్నారట, వీళ్ళిద్దరిని కలపకుండా ఇదొక ట్రాజెడీ లవ్ స్టోరీ లాగా ముగిద్దాం అనే ఉద్దేశంలో ముందు ఒక క్లైమాక్స్ రాసుకున్నారట, కానీ అది ఈ సినిమా కి సెట్ అవ్వదు.

Interesting Facts About Sukumar Arya Movie Climax

మరొక క్లైమాక్స్ గా అజయ్ క్యారెక్టర్( Ajay Character ) ను పాజిటివ్ గా మార్చి వాళ్ళని కలిపి ఆర్య గొప్ప గా ఫీల్ అవుతూ తను ఒంటరిగా మిగిలిపోవడాన్ని ఒక వర్షన్ లాగా రాసుకున్నారట.ఇక ఈ రెండు వర్షన్ లను కాదని సుకుమార్ మొదటినుంచి మరొకసారి స్క్రీన్ ప్లే ని చేంజ్ చేసుకుంటూ వస్తూ ఆర్య క్యారెక్టర్ ను మొదట నుంచి కొంచెం సెల్ఫిష్ గా అనిపించేలా సెట్ చేసుకుంటూ వచ్చి క్లైమాక్స్ లో మాత్రం హీరో హీరోయిన్ ను దక్కించుకోవాలి అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని సీన్లు రాసుకుంటూ వచ్చాడు.

Interesting Facts About Sukumar Arya Movie Climax

ఇక మొత్తానికైతే సక్సెస్ ఫుల్ క్లైమాక్స్ ని సెట్ చేసి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు.అయితే ఆర్య విషయంలో సూపర్ సక్సెస్ ని అందుకున్న సుకుమార్ ఆర్య 2 సినిమా( Arya 2 )లో మాత్రం అది బెడిసి కొట్టిందనే చెప్పాలి.ఇక మొత్తానికైతే సుకుమార్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ మీద దండయాత్ర చేస్తున్నాడు అనే చెప్పాలి.

Advertisement
Interesting Facts About Sukumar Arya Movie Climax-Arya Sukumar : ఆర్య �

ప్రస్తుతం ఆయన పుష్ప 2 తో మరో భారీ హిట్ ను దక్కించుకోవాలని చూస్తున్నాడు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు