Infosys Founder Narayana Murthy : ఇన్ఫోసిస్ సంస్థ నీదైతే ఒక హీరోయిన్ పై ఇలా మాట్లాడొచ్చా ?

ఇన్ఫోసిస్ సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ అయినటువంటి నారాయణ మూర్తి( Infosys Founder and Chairman Narayana Murthy )గురించి అందరికీ తెలుసు.

కానీ ఆయన ఉన్న స్థాయి మరిచి ఒక్కోసారి కొన్ని దిగజారుడు వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు అనే పేరు ఉంది.

ఇలా చెప్తే కొంత మందికి కోపం వస్తుందేమో కానీ అదే నిజం.అందుకు ఉదాహరణ ఆమధ్య కాలంలో ఆయన కరీనాకపూర్ పై చేసిన వ్యాఖ్యలే.

ఆయన చేసే పనికి అలాగే కరీనా కపూర్ కు ఎలాంటి సంబంధం లేదు కానీ ఒకసారి వారిద్దరూ కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేశారట.ఆ సందర్భంలో కరీనా కపూర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన దగ్గరగా చూడడంతో ఆమెపై ఆయనకు మంచి అభిప్రాయం లేదు.

అయితే అభిప్రాయం ఉండడంలో తప్పులేదు కానీ ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పడమే పెద్ద తప్పు.ఆ పని చేసి నారాయణ మూర్తి తన స్థాయిని తగ్గించుకున్నారు.

Infosys Founder Narayana Murthy Says Kareena Kapoor Ignored Fans On Flight
Advertisement
Infosys Founder Narayana Murthy Says Kareena Kapoor Ignored Fans On Flight-Info

వాస్తవానికి కరీనా కపూర్( Kareena Kapoor ) పై ఇప్పటికే చాలామంది నెగటివ్ గా మాట్లాడుతూనే ఉంటారు.అందుకు అనేక కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా ఆమె కొడుకులకు హిందూ వ్యతిరేక వాదుల పేర్లు పెట్టడం కూడా ఒక కారణం.

దీంతో బిజెపి వారికి ఆమె ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా కనిపిస్తూ ఉంటుంది.సరే ఆ సంగతి పక్కన పెడితే ఆమె ఒకసారి ఫ్లైట్ లో నారాయణ మూర్తితో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆమెను కలిసి మాట్లాడడానికి చాలా మంది ప్రయత్నించిన ఆమె ఏమాత్రం చెలించకుండా అలా కూర్చుని ఉందట.

ఆ విషయాన్ని ఆయన గమనించారు దాంతో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ కరీనాకపూర్ ఒక వ్యక్తిత్వం లేని మనిషి అని ఎలాంటి వారు వచ్చిన వారి కోసం ఒక అర నిమిషం అయినా కేటాయించడం మనుషుల లక్షణం అని ఆ మాత్రం ఇంగితం లేకుండా కరీనా వ్యవహరించడం ఆయనకు నచ్చలేదని చెప్పారు.

Infosys Founder Narayana Murthy Says Kareena Kapoor Ignored Fans On Flight

కానీ ఈ వ్యాఖ్యల పట్ల కాస్త నెగిటివిటీ వచ్చింది.ఆయన భార్య సుధా మూర్తి( Sudha Murthy ) సైతం ఆ వ్యాఖ్యలను ఖండించింది.హీరోయిన్ అయినంత మాత్రాన ఎవరితో పడితే వారితో సెల్ఫీలు ఇవ్వడం, వారిని పలకరించాల్సిన అవసరం ఆమెకు లేదు కదా.ఆమెకు కూడా విశ్రాంతి అవసరం కదా, ఏ సందర్భంలో ఆమె అలా ప్రవర్తించిందో తెలియకుండా మాట్లాడటం సరికాదు కదా అంటూ సుధా మూర్తితో పాటు చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆమెతో కలిసి ప్రయాణించిన ఒక తోటి ప్రయాణికుడు కూడా నారాయణమూర్తితో వ్యాఖ్యలతో ఏకీభవించాడు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటన ఎలా ఉండబోతుంది...

ఆయన హలో చెప్తే ఆమె మొహం తిప్పుకుందని కాసేపటికి విమాన సిబ్బందిని పిలిచి తన గురించి ఏదో చెప్పిందని తాను అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని వారితో మాట్లాడిందంటూ ఘాటుగా విమర్శలు గుప్పించాడు సదరు ప్రయాణికుడు.

Advertisement

తాజా వార్తలు