పేట సిగలో పారిశ్రామిక కిరీటం...!

సూర్యాపేట జిల్లా:అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సూర్యాపేట ఒడిలో ఇమామ్ పేట ఆటోనగర్ మరో మణిహారం కానుంది.

జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఇమామ్ పేటలో ఆటోనగర్ నిర్మాణానికి సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 69 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ మేరకు శనివారం ఉదయం ఇమామ్ పేటలోని ఆటోనగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఎండి నర్సింహారెడ్డి,జిల్లా కలెక్టర్ వెంకట్రావు,ఆర్డీవో ఇతర అధికారులతో కలిసి ఆటోనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి చొరవతో త్వరలో వందలాది పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.తాజాగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌తో యువతకు,కార్మికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.ఈ మేరకు నిర్మాణాలను కోసం రూ.16 కోట్ల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.సకల హంగులతో అద్భుత నిర్మాణాలు,కార్మికభవనం, ఈఎస్ఐ ఆసుపత్రి,విశాల రహదారులు, అబ్బురపరిచే కమాన్ లు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఇమామ్ పేట ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి.

పారిశ్రామిక పార్క్ ముందు ఆకట్టుకునే కమాన్, ముందు రహదారి నుండి చివరి వరకు విశాలమైన రహదారులు,కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంక్షేమ భవనం,వారి ఆరోగ్యంకోసం సకల సదుపాయాలతో ఈఎస్ఐ ఆసుపత్రి వంటి నిర్మాణాలు కొలువు దీరనున్నాయి.నిర్మాణాలనాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisement

అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.అత్యాధునిక పారిశ్రామిక పార్క్ లో ఇంకా చేపట్టవలసిన నిర్మాణాలు,సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధాంత చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేయాలి : కన్నెగంటి రవి
Advertisement

Latest Suryapet News