ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం... పాట్‌కమ్మిన్స్ కి 15.50 కోట్లు

దేశవాళీ క్రికెట్ లీగ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ఖరీదైనది అనే విషయం అందరికి తెలిసిందే.

ఈ ఐపీఎల్ లో అంటే క్రికెటర్స్ అందరికి పండగ అని చెప్పాలి.

ఇక ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది క్రికెటర్లు కోటీశ్వరులు అయ్యారు.అలాగే ఎంతో మంది క్రికెటర్లు తమ ప్రతిభతో వెలుగులోకి వచ్చారు.

ప్రతిభకి కొలమానంగా మారిన ఈ ఐపీఎల్ క్రికెట్ లీడ్ 2020కి వేలంపాట మొదలైంది.ఇక ఈ సారి లీగ్ కోసం ఏకంగా 332 క్రికెటర్స్ కోసం వేలం పాట జరుగుతుంది.

వీరిలో 186 మంది దేశీయ ఆటగాళ్ళు 146 మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు.వీరికి సంబందించిన వేల పాట ఇప్పటికే మొదలైంది.ఈ ఐపీఎల్ వేలం పాటలో ఊహించని విధంగా ఈ సారి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్‌కమ్మిన్స్ ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 15.50 కోట్ల పెట్టి దక్కించుకుంది.ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ని పంజాబ్ ఫ్రాంచైజ్ 10.75 కోట్లకు సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మెరిస్‌ను 10 కోట్లకు బెంగళూరు ఫ్రాంచైజ్, ఇంగ్లాండ్ కి చెందిన ఇయాన్ మోర్గాన్ ని 5.25 కోట్లకు కోల్‌కతా ఫ్రాంచైజ్, ఆస్ట్రేలియాకి చెందిన ఆరోన్ ఫించ్ ని బెంగుళూరు 4.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతానికి భారత్ తరుపున రాబిన్ ఊతప్పని 3 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.

Advertisement

ఇక ఈ వేలం పాట కొనసాగుతూ ఉండగా ఆరంభంలోనే దేశం తరుపున రాణిస్తున్న ఆటగాళ్ళని ఫ్రాంచైజ్ లు ఎక్కువ ధరలకి కొనుగోలు చేయడం విశేషం.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?
Advertisement

తాజా వార్తలు