భారతీయ సైన్స్, మ్యాథ్స్ టీచర్లకు శుభవార్త.. కాస్త కష్టపడితే యూకేలో అద్భుతమైన జీవితం

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ఏంటో, వారి సత్తా ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సారథులుగా వుండటంతో పాటు శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, మేధావులుగా భారతీయులు రాణిస్తున్నారు.

ఈ క్రమంలో ఎన్నో దేశాలు భారతీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.తాజాగా యూకేలోని( UK ) ఓ మీడియా నివేదిక ప్రకారం.

ఇంగ్లాండ్‌లో ఖాళీగా వున్న టీచర్ల పోస్టులు( Teacher Jobs ) భర్తీ చేయడానికి విదేశాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అక్కడి యాజమాన్యాలు భావిస్తున్నాయట.దీనిలో భాగంగా 10,000 పౌండ్ల విలువైన ‘‘అంతర్జాతీయ పునరావాస చెల్లింపులు’’ పథకానికి అర్హత పొందిన సైన్స్ , మ్యాథ్స్ టీచర్లు వున్న దేశాల్లో భారత్ కూడా నిలిచింది.

ఈ ఏడాది భారత్, నైజీరియా వంటి దేశాల నుంచి వందలాది మంది సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజ్ టీచర్లను యూకేకు రిక్రూట్ చేసుకోనున్నారని ది టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.‘‘ International Relocation Payments (IRP)’’ పథకాన్ని 2023 - 24 విద్యా సంవత్సరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనన్నారు.

Advertisement
Indian Maths Science Teachers In Demand In UK Details, Indian Teachers, Maths Te

యూకేలో ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్ వున్న విదేశీ ఉపాధ్యాయులకు ఈ పథకం వర్తిస్తుంది.వీసాల ఖర్చు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ ఛార్జ్, ఇతర పునరావాస ఖర్చులను ఈ పథకం కవర్ చేస్తుంది.

Indian Maths Science Teachers In Demand In Uk Details, Indian Teachers, Maths Te

యూకే అధికారులు రాబోయే విద్యా సంవత్సరంలో 300 నుంచి 400 మంది విదేశీ ఉపాధ్యాయులు ఐఆర్‌పీని పొందుతారని అంచనా వేస్తున్నారు.విదేశీ సిబ్బందిని ఆకర్షించడంలో ఇది విజయవంతమైతే ఈ పథకాన్ని ఇతర సబ్జెక్ట్‌లకూ విస్తరించాలని భావిస్తున్నారు.ఉపాధ్యాయుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం విదేశీ రిక్రూట్‌మెంట్‌కు చొరవ చూపింది.

దీని కింద భారత్, ఘనా, సింగపూర్, జమైకా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేల నుంచి గణితం, సైన్స్, లాంగ్వేజ్ టీచింగ్ అర్హతలున్న ఉపాధ్యాయులను గుర్తించారు.

Indian Maths Science Teachers In Demand In Uk Details, Indian Teachers, Maths Te

అర్హత గల ఉపాధ్యాయులకు తప్పనిసరిగా డిగ్రీ, టీచర్ ట్రైనింగ్‌తో పాటు కనీసం ఏడాది పాటు అనుభవం వుండాలి.అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఆంగ్లంలో మాట్లాడగలగాలి.ఇలాంటి నిపుణులు బ్రిటన్‌లో పనిచేయడానికి, వీసాలు పొందేందుకు అర్హులు.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

వారి ఆఫర్ లెటర్‌ను బట్టి.ఏడాదికి 27000 పౌండ్ల వరకు వేతనం పొందుతారు.

Advertisement

తాజా వార్తలు