సమంత ప్రస్తుతం హిందీలో సిటాడెల్ సిరీస్( Citadel ) షూట్ లో మరియు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉంది.ఈ అమ్మడు తెలుగు లో శాకుంతలం సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని… వంద కోట్ల సినిమా అంటూ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
కానీ పరిస్థితి రివర్స్ అయ్యింది.ఏమాత్రం ఆకట్టుకోని శాకుంతలం సినిమా( Shaakunthalam ) వల్ల సమంత ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ వాస్తవానికి శాకుంతలం సినిమా వల్ల సమంత యొక్క క్రేజ్ పెరిగింది.

సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా శాకుంతలం సినిమా లోని ఆమె పాత్ర ఆకట్టుకుంది.అంతే కాకుండా ఆ సినిమా వల్ల మంచి క్రేజ్ పెరిగింది అనడంలో సందేహం లేదు.సమంత( Samantha ) యొక్క క్రేజ్ పెరగడం మాత్రమే కాకుండా ఆమె యొక్క రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వం లో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) కీలక పాత్రలో సమంత హీరోయిన్ గా ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యింది.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మరియు గత సినిమాల స్థాయి కారణంగా భారీ ఎత్తున త్వరలో చేయబోతున్న సినిమాకు గాను పారితోషికం భారీగా అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వం లో చేయబోతున్న సినిమాకు గాను సమంత మొదటి సారి అయిదు కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ కు గాను అయిదు కోట్లకు పైగా పారితోషికంను తీసుకుంటుంది.అయితే సినిమాకు ఈ స్థాయి లో పారితోషికం తీసుకోవడం ఇదే ప్రథమం అంటూ సమాచారం అందుతోంది.
ఈ ఏడాదిలోనే సమంత మరియు నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కబోతుంది.వచ్చే ఏడాదిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.