మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం భోళా శంకర్( Bhola shankar ) సినిమా షూట్ లో ఉన్నాడు.విదేశాల్లో షూటింగ్ ముగించుకుని ఏ క్షణంలో అయినా చిరు ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు చిరంజీవి కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) స్క్రిప్ట్ రెడీ చేశాడు.సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కన్ఫర్మ్ అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై లేదా ఆగస్టు లోనే వీరిద్దరి కాంబో సినిమా ప్రారంభం కాబోతుంది.ఇక వీరిద్దరి కాంబో సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా లో చిరంజీవి తండ్రి కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నాడు.తండ్రి మరియు కొడుకు గా గతంలో చిరంజీవి అందరివాడు లో నటించిన విషయం తెల్సిందే.చిరంజీవి డబుల్ రోల్ అంటే కచ్చితంగా సినిమా తో అభిమానులకు పండుగే అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లు సాధించిన వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమా తో రాబోతున్నాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.చిరంజీవి నుండి మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్న మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ను కళ్యాన్ కృష్ణ అందించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.అదే జరిగితే కచ్చితంగా సోగ్గాడే చిన్ని నాయన తర్వాత మరో సూపర్ హిట్ ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అందుకుని ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈ సినిమా ను ఎవరు నిర్మించబోతున్నారు అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.







