న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో బీహార్ దివస్

బీహార్ ఫౌండేషన్ యూఎస్ఏ ఈస్ట్ కోస్ట్ చాప్టర్, బీహార్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా న్యూయార్క్‌లోని( New York ) కాన్సులేట్ జరనల్ ఆఫ్ ఇండియా శనివారం బీహార్ దివస్‌ను( Bihar Diwas ) ఘనంగా జరుపుకున్నారు.

రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ ఏడాది వేడుకల సందర్భంగా భారతీయ నేపథ్య గాయని, పద్మభూషణ్ శారదా సిన్హాకు నివాళుర్పించారు.దశాబ్ధాల పాటు తన స్వరంతో భోజ్‌పురి, మైథిలి, మూగహి జానపద సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని ప్రముఖులు తెలిపారు.

అలాగే ప్రకాష్ ఝా, అభిషేక్ తివారీ, శరద్ కుమార్, మహేశ్ కుమార్‌లకు బీహార్ విశ్వ గౌరవ్ సమ్మాన్ అవార్డులతో సత్కరించారు.అలాగే బీహార్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 50 ఏళ్ల వేడుకకు కూగా ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.బీహార్ రాష్ట్ర ఏర్పాటుకు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 22న బీహార్ దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీహారీలు జరుపుకుంటారు.1912లో బ్రిటీష్ వారు బెంగాల్ నుంచి విభజించి ఇదే రోజున బీహార్‌ను ఏర్పాటు చేశారు.ఈ రోజును బీహార్‌లో ప్రభుత్వ సెలవుదినంగా పాటిస్తారు.

Indian Consulate In New York Celebrates Bihar Diwas Details, Indian Consulate ,n

ఇకపోతే.ఇటీవలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా,( Consulate General Of India ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) భాగస్వామ్యంతో ఉమెన్స్ డే వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా విభిన్న రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన ముగ్గురు భారత సంతతి మహిళలను సత్కరించారు.

Advertisement
Indian Consulate In New York Celebrates Bihar Diwas Details, Indian Consulate ,N

జేపీ మోర్గాన్‌లో అడ్వైజరీ అండ్ మెర్జర్స్ అక్విజిషన్స్ గ్లోబల్ హెడ్ అను అయ్యంగార్. ఏ- సిరీస్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో వ్యవస్ధాపకురాలు అంజుల ఆచారియా.

సీఎన్‌బీసీలో రిపోర్టర్, యాంకర్‌గా పనిచేస్తున్న సీమా మోడీలు ఇందులో ఉన్నారు.

Indian Consulate In New York Celebrates Bihar Diwas Details, Indian Consulate ,n

ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎఫ్ఐఏ నిర్వహించడం ఇది ఏడో సారి.ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇండో యూఎస్ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్పూర్తి నింపినందుకు గాను అవార్డ్ గ్రహీతలను అన్నపూర్ణా దేవి ప్రశంసించారు.

ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు...
Advertisement

తాజా వార్తలు