Indian-American : ముస్లింలను కించపరిచేలా పోస్ట్.. క్షమాపణలు చెప్పిన ఇండో అమెరికన్ నేత

ముస్లింల మనోభావాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత విభూతి ఝా ఎట్టకేలకు దిగొచ్చారు.

తన వల్ల ఎవరైనా నొచ్చుకుంటే తనను క్షమించాలని.

అలాగే ట్వీట్‌ను కూడా డిలీట్ చేశారు.తన ఉద్దేశం ఎవరిని నొప్పించాలని కాదని ఝా అన్నారు.70 ఏళ్ల విభూతి ఝా మంగళవారం జరగనున్న న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ డిస్ట్రిక్ట్ 16 ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్ధి గినా సిల్లిట్టిపై ఆయన పోటీ చేస్తున్నారు.

చాలా నెలల క్రితం తనకు ఎవరో ఫార్వార్డ్ చేసిన ట్వీట్‌ను తాను తొలగించానని విభూతి ఝా ట్విట్టర్ ద్వారా తెలిపారు.అందులో వున్న కంటెంట్, ఇతర అంశాల గురించి కొన్ని ముస్లిం గ్రూపులు అసంతృప్తిగా వున్నాయని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

తనకు చాలా మంది ముస్లిం స్నేహితులు వున్నారని.వారి కష్ట సమయాల్లో పరస్పరం ఆదుకుంటూ వుంటామని విభూతి ఝా పేర్కొన్నారు.స్నేహం అంటే సంతోషాన్ని , కోపాన్ని పంచుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని.

Advertisement

సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడమేనని ఆయన అన్నారు.

లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.విభూతి ఝా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ధిక సేవల సంస్థ గ్లోబల్ క్యాపిటల్ సర్వీస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ఫిటెనెస్ యాప్ అయిన Relaxxappకు సహ వ్యవస్థాపకుడు కూడా.న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీలోని 150 జిల్లాలలో న్యూయార్క్ 16వ స్టేట్ అసెంబ్లీ జిల్లా కూడా ఒకటి.2021 నుంచి డెమొక్రాట్ నేత సిల్లిట్టి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ జిల్లా నార్త్ హెంప్‌స్టెడ్ పట్టణంలోని నసావు కౌంటీలో వుంది.

జిల్లాలో గ్రేట్ నెక్, నార్త్ హిల్స్, ఈస్ట్ హిల్స్, ఫ్లవర్ హిల్, ఓల్డ్ వెస్ట్ బరీ, రోస్లిన్ ఎస్టేట్స్, లేక్ సక్సెస్, రోస్లిన్ హైట్స్, పోర్ట్ వాషింగ్టన్, హెరిక్స్ గ్రామాలు వున్నాయి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు