నేడు కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య పోరుకు వర్ష గండం..!

ఆసియా కప్( Asia Cup ) టోర్నీ సూపర్-4 లో భాగంగా నేడు కొలంబో వేదికగా మధ్యాహ్నం 3:00 గంటలకు భారత్- పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరుగనుంది.

అయితే నేడు జరుగనున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

అందుకే మ్యాచ్ నిర్వాహకులు ముందుగానే నేడు జరిగే మ్యాచ్ కు రిజర్వ్ డే ను కేటాయించారు.ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ను మధ్యలో ఆపాల్సి వస్తే సోమవారం తిరిగి కంటిన్యూ చేయనున్నారు.

ఈనెల 2న భారత్- పాక్ మధ్య మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.క్రికెట్ అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని నేటి మ్యాచ్ కు రిజర్వ్ డే ను కేటాయించారు.పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు 66 పరుగులకే టాప్-4 వికెట్లను కోల్పోయింది.

సరైన సమయంలో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా( Ishan Kishan ) లు అద్భుత ఆటను ప్రదర్శించడం వల్ల భారత జట్టు కాస్త చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయగలిగింది.

Advertisement

నేడు జరిగే మ్యాచ్లో మహమ్మద్ షమీ స్థానంలో బుమ్రా తిరిగి జట్టులో చేరాడు.కేఎల్ రాహుల్ జట్టులోకి ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఇషాన్ కిషన్ పక్కన పెట్టనున్నారు.నేడు జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్ అద్భుతంగా రాణించి జట్టుకు మంచి స్కోరు అందించాల్సి ఉంది.

పాక్ తో జరిగిన మ్యాచ్ లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ తన ఫామ్ ను నిరూపించుకోవాల్సి ఉంది.ఇక బౌలింగ్ విభాగానికి వస్తే సిరాజ్, జడేజా, బుమ్రా, కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ లతో పటిష్టంగా ఉంది.

జట్టులోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణిస్తేనే పాకిస్తాన్( Pakistan ) పై భారత్ పైచేయి సాధించగలుగుతుంది.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు