యజ్ఞం ప్రాముఖ్యత... యజ్ఞం లోని రకాలు ఇవే..!

మన భారతదేశ ఆచారవ్యవహారాల్లో భాగంగా యజ్ఞానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం.

వేదాలలో యజ్ఞం గురించి యజ్ఞో వై విష్ణుః అని చెప్పారు.అంటే దీని అర్థం యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు.

అయితే ఈయజ్ఞం అను శబ్దం యజ దేవపూజయాం అను ధాతువు నుంచి ఏర్పడింది.దైవపూజే యజ్ఞం.

పురాణాల ప్రకారం ఎంతో మంది రాజులు గొప్ప వారు యజ్ఞాలు నిర్వహించి ఎన్నో విజయాలను పొందారు.పురాణాల ప్రకారం మన దేశంలో ఎన్నో రకాల యజ్ఞాలను నిర్వహించారు.

Advertisement
Importance Of Yajna These Are The Types Of Yajna, Yajna, Importance, Yaja Devapu

అసలు యజ్ఞం అనేది ఎందుకు చేస్తారంటే ఆ దేవ దేవతలకు సంతృప్తిని ఇవ్వడానికి, వారి అనుగ్రహం పొందటానికి వేద మంత్రోచ్ఛారణలతో వేద పండితులు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు.

Importance Of Yajna These Are The Types Of Yajna, Yajna, Importance, Yaja Devapu

యజ్ఞం చేసేటప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హోమాగ్నులు ఉంటాయి.ఈ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞములో పాలు, నెయ్యి, ధాన్యం, వివిధ రకాల ఆకులను వేసి యజ్ఞం నిర్వహిస్తుంటారు.యజ్ఞాలు కొన్ని నిమిషాల నుంచి మొదలుకొని కొన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా చేస్తుంటారు.

ఇందులో భాగంగానే అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం వంటివి ఉన్నాయి.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యజ్ఞాలు ఆరు రకాలుగా ఉన్నాయి.అవి.ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం,స్వాధ్యాయయజ్ఞం, యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం,సంశితయజ్ఞం వంటి 6 రకాల యజ్ఞాలూ కాకుండా, మరో మూడు రకాలు ఉన్నాయి అవి: పాక యజ్ఞాలు,హవిర్యాగాలు ,సోమ సంస్థలు.ఇటువంటి యజ్ఞాలు నిర్వహించడం ద్వారా ఆ దేవతల రుణం తీర్చుకున్నట్లని మన పురాణాలు చెబుతున్నాయి.

యజ్ఞగుండం చేయడం ద్వారావెలువడే పొగ నుంచి మన వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని శుభ్రం చేస్తుంది.దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు.యజ్ఞం చేసే వ్యక్తి మాత్రమే కాకుండా చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి వారు సైతం లబ్ధి పొందుతారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు