ఇక పై నేను ఒంటరి కాదు.. కంగనా పోస్ట్ వైరల్?

బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ సుపరిచితమే.ఏ విషయమైనా ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఈమెకు అలవాటు.

ఈ క్రమంలోనే ఈమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.తాజాగా కంగనా నటించిన ధాకడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కంగనా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కంగనా రనౌత్ ఇది వరకు బాలీవుడ్ లో ఉన్న నేపోటిజం గురించి ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ స్టార్ హీరో హీరోయిన్ల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అయితే తాజాగా ఈమె చేసిన పోస్టు చూసి ఒక్కసారిగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ షాకయ్యారు.

Advertisement
I Am Not Single Anymore Kangana Post Viral Details, Kangana, Bollywood Heroine,

ఇంతకీ కంగనా చేసిన పోస్ట్ ఏమిటి అనే విషయానికి వస్తే.ఈమె నటిస్తున్న ధాకడ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అయితే ఈ సినిమా ట్రైలర్ ను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ కంగనా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

I Am Not Single Anymore Kangana Post Viral Details, Kangana, Bollywood Heroine,

ఇక ఈ విషయం తెలిసిన బాలీవుడ్ తారలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఈ పోస్టును కంగనా షేర్ చేస్తూ నా దబాంగ్ హీరోకి ధన్యవాదాలు.ఈయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఇకపై నేను ఒంటరి కాదు.

ఇక పై ఒంటరి అని చెప్పను.మెత్తం ధాకడ్‌ టీమ్‌ తరఫున మీకు ధన్యవాదాలు అని తెలిపింది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇలా సల్మాన్ ఖాన్ సపోర్ట్ తనకు లభించడంతో తాను ఒంటరి కాదంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు