ఒక్క నెల రోజు మాంసాహారం మానేస్తే.. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

శాఖాహారం ఆరోగ్యానికి మంచిదని, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

అయినప్పటికీ మాంసాహారం పూర్తిగా మానేయకపోయినా, పరిమితంగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.

అయితే మాంసాహారం మానేసి పూర్తిగా శాఖాహారం తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని రీసెర్చ్లు చెబుతున్నాయి.అలా కుదరకపోతే కనీసం ఒక నెల పాటు అయినా నాన్ వెజ్ బంద్ చేసి పూర్తిగా శాఖాహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

ఈమధ్య చాలామంది నాన్ వెజ్( Non-vegetarian ) తినే వారు కూడా శాఖాహారులుగా మారుతున్నారు.

అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా ఆరోగ్యాన్ని, అందాన్ని ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకొని శాకాహారానికి చాలామంది మారిపోతున్నారు.మాంసాహారంలో లభించే పోషకాలను కొన్ని రకాల శాకాహార పదార్థాల నుండి కూడా పొందవచ్చు.

Advertisement

అయితే ప్రోటీన్ కోసం చాలామంది మాంసం తింటూ ఉంటారు.అయితే కంది, సోయాబీన్స్, చిక్కుడు( Soybean ) లాంటి వాటిల్లో కూడా పుష్కలంగా ఈ పోషకం కచ్చితంగా లభిస్తుంది.

దీర్ఘకాలిక మాంసాహారంతో పోల్చితే శాఖాహారం త్వరగా జీర్ణం అవుతుంది.ఎందుకంటే ఇది గట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

అలాగే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది.మాంసాహారం తరచుగా తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ( High blood pressure )పెరిగిపోతాయి.ఫలితంగా అధిక రక్తపోటు, గుండెపోటు లాంటి ప్రమాదకరమైన గుండె జబ్బులకు( Heart disease ) దారి తీయవచ్చు.

అయితే అందుకు శాకాహారం తీసుకుంటే ఈ సమస్యలన్నీటిని చెక్ పెట్టవచ్చు.ఎందుకంటే వెజ్ ఫుడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తూ ఉంటాయి.మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తాయి.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

మాంసాహారంతో పోల్చితే శాఖాహారంలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.అవి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ను కూడా పెంచుతాయి.

Advertisement

దీంతో వివిధ రకాల క్యాన్సర్ రిస్కులు కూడా తగ్గిపోతాయి.మాంసాహారం ముఖ్యంగా రెడ్ మీట్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మాంసం తరచుగా తీసుకోవడం వలన క్యాన్సర్, గొడ్డు మాంసం తినడం వలన కాలేయ వ్యాధులు, రుషణ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది.ఇక మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.

కాబట్టి మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.అలాగే పేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది.

ఫలితంగా జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

తాజా వార్తలు