జాగ్రత్తా! ఈ ఆర్‌బీఐ కొత్త నియమాన్ని ఉల్లంఘిస్తే.. చెక్‌ బౌన్స్‌ అవుతుంది!

ఈ నెల ఆగస్టు ప్రారంభంలో జరిగిన మేజర్‌ చేంజెస్‌ అందరికీ తెలిసిందే! ఇందులో భాగంగా అంటే ఆర్‌బీఐ నిర్ధేశించిన కొత్త నిబంధనల ప్రకారం నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌ (ఎన్‌ఏసీహెచ్‌) ఇక పై 24 గంటలూ పనిచేయనుంది.ఈ మార్పు ప్రభుత్వ, ప్రైవేటు రెండూ బ్యాంకులకు వర్తిస్తుంది.

 If You Not Follow Rbi New Rule..your Cheque Will Be Bounced Check Bounce  Cases-TeluguStop.com

దీంతో వారాంతాల్లో కూడా ప్రజలు తమ చెక్కులను సులభంగా క్లియర్‌ చేసుకోగలుగుతారు.పనిదినాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.

వినియోగదారుడు వారి చెక్కులను సెలవు దినాల్లో కూడా క్లియర్‌ చేసే అవకాశం ఉంటుంది.కానీ, దీనివల్ల డైలీ బేస్‌ చెక్కులను క్లియర్‌ చేసే వ్యక్తులపై ప్రభావం పడుతుంది.

వారి కార్యకలాపాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే, వారు సంతకం చేసిన చెక్కులు పని చేయని రోజున కూడా క్లియర్‌ అవుతాయి.

ఆర్‌బీఐ ఈ కొత్త నియమంతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.దీన్ని ప్రక్రియ కూడా తక్కువ సమయం తీసుకుంటుంది.

అయితే, బ్యాకు ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నిల్వలను మెయిన్‌టైన్‌ చేయాల్సి ఉంటుంది.ప్రాసెస్‌ స్పీడ్‌గా అవుతుంది.కాబట్టి మీ చెక్‌ వేగంగా ప్రాసెస్‌ అవుతే, అది ఒక వేళ బౌన్స్‌ అయితే, అప్పుడు మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.అందుకే ఈ ఇబ్బందిని అధిగమించడానికే మీ బ్యాంకు ఖాతాల్లో ఎల్లప్పుడూ నిల్వ ఉంచడం మేలు.

ఇంతకు ముందు, వారాంతాల్లో పనిదినాల్లో చెక్కులు క్లియర్‌ కావు కాబట్టి దీంతో ఏం సమస్య లేకపోయేది.

Telugu Cheque Bounce, Loan Emi, Mutual Funds, Nach, Rbi Banks-Latest News - Telu

ఎన్‌ఏసీహెచ్, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) జీతాలు, పెన్షన్లు, వడ్డీ, డివిడెండ్లతో సహా ఇతర లావాదేవీలను బల్క్‌ పేమెంట్‌ సిస్టం ద్వారా నిర్వహిస్తుంది.ఎన్‌ఏసీహెచ్క రెంటు, నీరు, గ్యాస్, ఫోన్, లోన్‌ ఈఎంఐ, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి వివిధ బిల్లుల చెల్లింపులను సులభతరం చేస్తుంది.ఆర్‌బీఐ తాజా ఆదేశాలతో ఈ సౌకర్యాలు వారాంతాల్లో కూడా చేయనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube