పవన్ కళ్యాణ్ 'వారాహి' యాత్ర కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

కోట్లాది మంది అభిమానులు మరియు కార్యకర్తలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎల్లప్పుడూ జనాల్లో ఉండాలని, మిగిలిన రాజకీయ పార్టీ నాయకులూ లాగ పర్యటనలు చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనాల్లో ఉంటే ఆయన సునామి ని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా తట్టుకోలేరు అనేది వాళ్ళ ప్రగాఢమైన నమ్మకం.

అందుకు రీసెంట్ ఉదాహరణే వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ).ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి విడత గా ప్రారంభమైన ఈ వారాహి యాత్రకి జనాలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ ఉన్నారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభలకు ఎక్కువగా యువత హాజరు అవుతూ ఉంటారు.

కానీ ఈ వారాహి యాత్ర కి అన్నీ వయస్సులకు సంబంధించిన వాళ్ళు హాజరవ్వడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఆడవాళ్ళూ అయితే అడుగడుగునా హారతులు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్క ర్యాలీ చేపడితే సుమారుగా మూడు గంటల సమయం పడుతుంది.

అంత జనవాహిని ఈ వారాహి యాత్ర కి సమకూడుతున్నారు.

If You Know How Much Pawan Kalyan Is Spending On varahi Trip, You Will Be Amaz
Advertisement
If You Know How Much Pawan Kalyan Is Spending On 'Varahi' Trip, You Will Be Amaz

ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది కాబట్టే , అభిమానులు ఆయనని జనాల్లో ఉండమని ప్రాధేయపడుతుంటారు.ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చింది.నేడు ఆయన అమలాపురం జనసేన పార్టీ( Janasena party ) నాయకులతో భేటీ అయ్యాడు.

ఈ భేటీ లో ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మాట్లాడుతూ మాటికొస్తే నన్ను జనాల్లోకి రమ్మని మన కార్యకర్తలు కోరుకుంటూ ఉంటారు.నాకు నిజంగానే రావాలని ఉంటుంది, సినిమాల్లో పని చెయ్యడం కంటే నాకు జనాల్లో ఉండడమే ఇష్టం.

కానీ నేను కదిలితే ఒక ఏనుగు కదిలినట్టే.చూడడానికి సన్నగానే ఉంటాను కానీ, నేను కదలాలంటే నాతో పాటు 400 మంది కదలాలి, వాళ్లకి రూంలు, భోజనాలు , వాళ్ళ యోగక్షేమాలు ఇలా అన్నీ చూసుకోవాలి.

దానికి చాలా ఖర్చు అవుతుంది, మన దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు లేవు.నిజాయితితో సంపాదించిన డబ్బులే ఉన్నాయి, కాబట్టి మిగతా వాళ్ళ లాగ మనం దూకుడుతో పోలేము ఒక్కోసారి అని చెప్పుకొచ్చాడు.

If You Know How Much Pawan Kalyan Is Spending On varahi Trip, You Will Be Amaz
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర కి ఒక్కో ప్రాంతానికి కానీ కనీసం 20 లక్షల రూపాయిల వరకు ఖర్చు అవుతుంది అట.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలకు వచ్చిన అడ్వాన్స్ తో ఈ యాత్ర ని చేపడుతున్నాడట.2018 వ సంవత్సరం తో పోలిస్తే ఈసారి ఆయన ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.ఒక్కో సినిమాకి ఇప్పుడు ఆయన 80 నుండి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు.

Advertisement

అప్పట్లో అయితే ఎలక్షన్ అఫిడిట్ ని ఒకసారి పరిశీలిస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర, వదిన సురేఖ దగ్గర అలాగే మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ దగ్గర అప్పులు చేయడాన్ని మనం గమనించొచ్చు.అందుకే కాస్త అభిమానులు ఇవన్నీ అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులూ కోరుతున్నారు.

తాజా వార్తలు