ఐఫోన్ 15 కొనే బడ్జెట్ లేకుంటే ఈ స్మార్ట్ ఫోన్లే బెస్ట్..!

అత్యంత ఖరీదైన ఫోన్లకు స్టేటస్ సింబల్ గా యాపిల్ ఐఫోన్లు మారాయి.ఐఫోన్లలో స్పెసిఫికేషన్స్ తో పాటు ధర కూడా అధికంగానే ఉంది.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1TB వేరియంట్ ధర రూ.199900 వరకు ఉంటుంది.భారతదేశంలో ఐఫోన్ 15 128GB ధర రూ.79900 గా ఉంది.సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంత బడ్జెట్ పెట్టి ఐఫోన్లు కొనడం కాస్త కష్టమే.

అయితే ఇలాంటివారు నిరుత్సాహపడకుండా మార్కెట్లో కొన్ని ఫోన్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి.ఆ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏమిటో చూద్దాం.ఐఫోన్ 14:( iPhone 14 ) ఈ ఫోన్ చూడడానికి ఐఫోన్ 15 లాగా కనిపిస్తుంది.కానీ ఈ రెండు సిరీస్ ల ధర మధ్య వ్యత్యాసం రూ.15 వేల వరకు ఉంటుంది.ఫీచర్ల విషయానికి వస్తే ఐఫోన్ 15 కంటే ఐఫోన్ 14 లో కొన్ని తేడాలు ఉంటాయి.

ఐఫోన్ 14 లో అద్భుతమైన స్క్రీన్, టాప్ చిప్ సెట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కు సపోర్ట్, మంచి కెమెరా సిస్టం తో ఉంటుంది.

If You Dont Have The Budget To Buy Iphone 15, This Smartphone Is The Best , Goo

వన్ ప్లస్ 11:( One Plus 11 ) ఈ స్మార్ట్ ఫోన్, ఐఫోన్15 తో సమానంగా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఆమోలెట్ డిస్ ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 చిప్ సెట్ లాంటి స్పెసిఫికేషనులతో ప్రీమియం సెగ్మెంట్ తో సత్తా చాటుతోంది.కాబట్టి మీ బడ్జెట్ ఐఫోన్ కు రీచ్ అవ్వకపోతే, ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్.

If You Dont Have The Budget To Buy Iphone 15, This Smartphone Is The Best , Goo
Advertisement
If You Don't Have The Budget To Buy IPhone 15, This Smartphone Is The Best , Goo

గూగుల్ పిక్సెల్ 8 ప్రో:( Google Pixel 8 Pro ) ఈ ఫోన్లో అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్లు, బెస్ట్ పర్ఫామెన్స్ అందించే డివైజ్ లు ఉన్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన టెన్సర్ G2 SoC చిప్ సెట్ తో ఇది ఫాస్టెస్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది.ఇంకా చాలా ఫీచర్లను కలిగి ఉంది.

ఐఫోన్ 15 కొనలేని వారు గూగుల్ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్.

Advertisement

తాజా వార్తలు