ఈ మూడు ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్న సులభంగా చెక్ పెట్టవచ్చు!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, పెరుగుతున్న కాలుష్యం తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంది.

హెయిర్ ఫాల్ కారణంగా కొందరు మానసికంగా కూడా కృంగిపోతుంటారు.

జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మందులు కూడా వాడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే మూడు ఉంటే చాలు హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఆ మూడు ఏంటి.వాటితో జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టవచ్చు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

If These Three Can Helps To Stop Hair Fall Quickly Hair Fall, Stop Hair Fall, O
Advertisement
If These Three Can Helps To Stop Hair Fall Quickly! Hair Fall, Stop Hair Fall, O

ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు రెబ్బలు కరివేపాకు ( Curry leaves )తో పాటు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట లేదా గంటన్నర అనంత‌రం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

If These Three Can Helps To Stop Hair Fall Quickly Hair Fall, Stop Hair Fall, O
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్యకు సూపర్ ఫాస్ట్ గా చెక్ పెట్టడంలో ఉల్లి అల్లం కరివేపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

Advertisement

చుండ్రు సమస్య( Dandruff ) ఉన్న సరే దూరం అవుతుంది.అందువ‌ల్ల హెయిర్ ఫాల్ తో ఇబ్బంది ప‌డుతున్న‌వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు