అమ్మాయిలకు సపరేటు సీటింగ్ అరేంజ్మెంట్ కావాలన్న స్కూల్ బాయ్స్.. కారణం తెలిస్తే..

స్కూల్ లైఫ్ ( School life )అనేది చాలా జాలీగా సాగిపోతుంది.

ఈ సమయంలో ఆ తర్వాత ఫ్రెండ్స్ తో హాయిగా ఆడుకోవచ్చు అంతేకాదు క్లాసులో కూడా అల్లరి చేస్తూ లైఫ్‌ను కలర్ ఫుల్‌గా గడిపేయవచ్చు.

పిల్లలు చేసే కొన్ని పనులు వల్ల టీచర్లకు కూడా మంచి జ్ఞాపకాలు ఏర్పడతాయి.కొన్నిసార్లు స్టూడెంట్స్ చాలా ఫన్నీ కంప్లైంట్ ఇస్తుంటారు.

అవి వింటే నవ్వుకోక తప్పదు.తాజాగా అలాంటి ఒక ఫన్నీ కంప్లైంట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల కొంతమంది విద్యార్థులు తమ ప్రిన్సిపాల్‌కి ఫర్మాల్‌ లెటర్ రాశారు.ఆ లేఖలో, తమ తరగతిలోని అమ్మాయిలు ఎప్పుడూ మొదటి రెండు వరుసల్లో కూర్చుంటారని, వారి వెంట్రుకలు తమ బల్లలపై పడుతూ చదువుకునేందుకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు.

Advertisement
If The School Boys Know The Reason Why Girls Want Separate Seating Arrangement,

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.చాలా మంది ఈ కంప్లైంట్ లెటర్ చూసి బాగా నవ్వుకుంటున్నారు.

X యూజర్ అపూర్వ( User X Apoorva ) ఆ లెటర్ ఫోటోను ఆన్‌లైన్‌లో పంచుకుంటూ "ఈ ఫోటోలో ఒక అప్లికేషన్ కనిపిస్తుంది.ఆ అప్లికేషన్‌ను ప్రిన్సిపాల్‌గారికి రాశారు.

ఆ అప్లికేషన్‌లో, మేము (అందరూ అబ్బాయిలు) అమ్మాయిలకు ప్రత్యేకంగా ఒక వరుస ఇవ్వాలని కోరుతున్నాము, ఎందుకంటే వారు ప్రతి వరుసలో మొదటి రెండు సీట్లు ఆక్రమిస్తున్నారు అని రాసి ఉంది." అని రాసుకొచ్చింది.

If The School Boys Know The Reason Why Girls Want Separate Seating Arrangement,

"అంతేకాకుండా, అమ్మాయిల వెనుక కూర్చునే అబ్బాయిలకు వారి వెంట్రుకల వల్ల ఇబ్బంది అవుతుందని కూడా అందులో రాశారు.అమ్మాయిల వెంట్రుకలు వారి డెస్క్‌ల వరకు వస్తున్నాయని చెప్పారు.ఆ రోజు తరగతిలో ఉన్న అబ్బాయిలందరూ ఆ అప్లికేషన్‌పై సంతకాలు చేశారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

" అని కూడా ఆ సోషల్ మీడియా యూజర్ వివరించింది.ఆ అప్లికేషన్‌ను షేర్ చేసిన తర్వాత, దాన్ని ఐదు లక్షల మందికి పైగా చూశారు.8,400 మందికి పైగా లైక్‌లు కూడా వచ్చాయి.చాలామంది అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు."

Advertisement

ఇది చాలా ఫన్నీగా ఉంది.నీ తమ్ముడు చాలా క్యూట్‌గా ఉన్నాడు, అతనికి ఒక హగ్ ఇవ్వాలి. అని ఒకరు కామెంట్ చేశారు.

ఈ అప్లికేషన్ నేను రాసిన అప్లికేషన్ కంటే చాలా బాగుంది అని మరొకరు కామెంట్ చేశారు.అని చెప్పినా కారణం కరెక్టే కదా అమ్మాయిలకు ప్రత్యేకంగా బెంచులు వేయాలి అని మరి కొంతమంది అన్నారు.

మేం కూడా అమ్మాయిల హెయిర్ కారణంగా చదువుకోలేక ఇబ్బంది పడ్డామని ఇంకొందరు తమ స్కూల్ లైఫ్ గుర్తు చేసుకున్నారు.

తాజా వార్తలు