మనిషివేనా.. ఇలా చేస్తే తినేవాళ్లు పరిస్థితి ఏమైనా ఆలోచించావా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Authorities ) హోటల్లో, రెస్టారెంట్లు, స్కూల్లో, కాలేజీలలో ఇలా పలుచోట్ల భోజనాలు అందిస్తున్న కార్యాలయాలను తీవ్రంగా తనిఖీ చేపడుతూ ఉన్నారు.

అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ప్రముఖ యూనివర్సిటీలో మెస్ లో ఒక ఉద్యోగి చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి లోనవ్వడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పలు డిమాండ్లు కూడా తలెత్తుతున్నాయి.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్ రాజధాని లోని లక్నో యూనివర్సిటీలో మెస్ లో( Mess in Lucknow University ) బంగాళదుంపలు క్లీన్ చేస్తూ ఒక వ్యక్తి కనబడ్డాడు.వాస్తవానికి అతడు బంగాళదుంపలు కడిగిన తీరును చూసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఉత్తరప్రదేశ్ రాజధానిలోని లక్నో యూనివర్శిటీ లోని హోమీ జహంగీర్ భాభా హాస్టల్‌ ( Homi Jahangir Bhabha Hostel )లో ఉద్యోగి ఒకరు కాళ్లతో బంగాళాదుంపలను కడుగుతూ కనిపించాడు.

Advertisement

దీనితో అక్కడ ఉండే స్టూడెంట్స్ వీడియో తీశారు.అంతటితో ఆగకుండా ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వగా.అతడి పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు.

ఇక మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు ఇలాంటి భోజనం తిన్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు వారికి అనేక సమస్యలు తలెత్తుతాయని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు