బన్నీకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందా.. 'పుష్ప 2' తర్వాత వాట్ నెక్స్ట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా 2021 డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

400 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సుకుమార్ కూడా అన్నివిధాలా స్క్రిప్ట్ ను మార్పులు చేర్పులు చేసారు.

ఫ్యాన్స్ అంతా గత ఏడాదిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పార్ట్ 2 ఎట్టకేలకు ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఒకే ఒక్క సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.

ఇక ఇప్పుడు పార్ట్ 2 తో కూడా బన్నీ విజయం అందుకోవడం ఖాయం అనే టాక్ నడుస్తుంది.

Icon Star Allu Arjun Next Movie Update Details, Allu Arjun, Pushpa 2, Sukumar, R
Advertisement
Icon Star Allu Arjun Next Movie Update Details, Allu Arjun, Pushpa 2, Sukumar, R

మరి ఇక్కడ వరకు బాగానే ఉన్న ప్రస్తుతం బన్నీకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.ఎందుకంటే పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తర్వాత తన ఇమేజ్ కు తగినట్టుగా కథలు సెలెక్ట్ చేసుకోవాలి.తన ఇమేజ్ కు తగినట్టుగా ఎలాంటి కథలను ఓకే చేయాలి.

ఏ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ఇప్పుడు బన్నీని బాగా డిస్టర్బ్ చేస్తుందట.

Icon Star Allu Arjun Next Movie Update Details, Allu Arjun, Pushpa 2, Sukumar, R

ఇక బన్నీ టెన్షన్ కు మరో కారణం కూడా ఉంది.అందుకు కారణం బన్నీతో సినిమా చేసేందుకు ప్రెజెంట్ టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కూడా ఖాళీగా లేడు.రాజమౌళి నుండి త్రివిక్రమ్ వరకు అందరూ బిజీగానే ఉన్నారు.

మళ్ళీ సుకుమార్ తో అంటే కష్టం.రాజమౌళి మహేష్ తో, ప్రశాంత్ నీల్ ప్రభాస్, ఎన్టీఆర్ లతో, త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఇలా ఏ డైరెక్టర్ ను చుసిన ఖాళీగా లేరు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అందుకే నెక్స్ట్ ఎవరితో అనే విషయంలో అల్లు అర్జున్ టెన్షన్ గా ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు