ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న సినిమా ”దసరా”.న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్ లో బరిలో దిగబోతుంది.
ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కడైనా సరే పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ వస్తున్నాడు.రా అండ్ విలేజ్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.
ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో సాలిడ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.లేటెస్ట్ గా ఈ సినిమా నుండి నాని బర్త్ డే కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ ను ఇస్తున్నట్టు తెలిపారు.
అది కూడా ఇండియన్ సినిమా దగ్గర మొట్టమొదటి సారిగా తీసుకొస్తున్నట్టు చెప్పి మరింత జోష్ నింపారు.
మరి ఆ అప్డేట్ ఏంటంటే.నాని 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇండియన్ వైడ్ గా మొత్తం 39 సెంటర్స్ లో ఈ సినిమా కౌంట్ డౌన్ ఇన్స్టాలేషన్స్ ను పెట్టబోతున్నట్టు తెలిపారు.అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆడియెన్స్ లో అలర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి.
ఇది ఇండియాలో మొదటిసారి జరుగుతున్నట్టు కూడా మేకర్స్ చెబుతున్నారు.దీంతో సాలిడ్ ప్రమోషన్స్ జరిగినట్టే.
ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.