IAS Srushti Deshmukh : ఎన్నో ఎదురుదెబ్బలు.. తొలి ప్రయత్నంలో సివిల్స్ లో ఐదో ర్యాంక్.. సృష్టి దేశ్‌ముఖ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.ఆ కష్టాలు అనుభవించిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు తెలియవు.

అలా తన కష్టంతో ఎదిగి ప్రశంసలు పొందడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన వాళ్లలో సృష్టి దేశ్‌ముఖ్( Srushti Deshmukh ) ఒకరు.సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఆలిండియా స్థాయిలో సృష్టి ఐదో ర్యాంక్ ను సాధించడం గమనార్హం.

బీటెక్ చదివిన సృష్టి తన సక్సెస్ స్టోరీతో( Success Story ) ప్రశంసలు అందుకుంటున్నారు.ఐఏఎస్ గా( IAS ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి అదే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.

చాలా సందర్భాల్లో సృష్టి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని( Madhya Pradesh ) భోపాల్ కు చెందిన సృష్టి ఇంటర్ పరీక్షలలో 93.4 శాతం మార్కులు సాధించడం గమనార్హం.

Advertisement

భోపాల్‌లోని( Bhopal ) లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివిన సృష్టి జేఈఈ పరీక్షలో ఫెయిలైన తాను యూపీఎస్సీ పరీక్షలో( UPSC Exam ) సక్సెస్ సాధిస్తానో లేదో అని కంగారు పడ్డారు.అయితే ఎంతో కష్టపడి సాగించిన ప్రిపరేషన్ వల్ల ఆమె సులువుగానే లక్ష్యాన్ని సాధించేశారు.కష్టంతో ప్రయత్నిస్తే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని సృష్టి సక్సెస్ స్టోరీతో అర్థమవుతోంది.

కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన తర్వాత ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున్ బి.గౌడను( Dr.Nagarjun B Gowda ) ఆమె పెళ్లి చేసుకోవడం గమనార్హం.రేయింబవళ్లు కష్టపడితే మనలోని మైనస్ లను కూడా ప్లస్ లుగా మార్చుకోవచ్చని ఆమె సక్సెస్ స్టోరీతో అర్థమవుతోంది.

సృష్టి దేశ్ ముఖ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సృష్టి దేశ్ ముఖ్ ను తాము కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!
Advertisement

తాజా వార్తలు