నా దేవుడితో సినిమాలు చేయను... బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్లగణేష్ అనంతరం నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ ని ఏకంగా దేవుడితో పోలుస్తూ ఈయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటాయి.ఇక సోషల్ మీడియా వేదికగా బండ్లగణేష్ చేసే వ్యాఖ్యలు కూడా తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి.

ఇక కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి త్వరలోనే తన దేవుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ఇన్ని రోజులు ప్రకటించారు.అయితే ప్రస్తుతం నా దేవుడు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడం లేదని బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బండ్ల గణేష్ ఈ విధంగా కామెంట్ చేయడానికి కారణం లేకపోలేదు.

I Am Not Doing Movies With Pawan Kalyan Bandla Ganesh Comments Viral Details, B
Advertisement
I Am Not Doing Movies With Pawan Kalyan Bandla Ganesh Comments Viral Details, B

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా నాలుగైదు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చారు.ఇలా ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఈ సినిమాలు పూర్తి అయ్యేలోపు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు వస్తాయి.

దీంతో పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలలో నటించే సమయం కుదరకపోవచ్చు అందుకే తాను పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం సినిమాలు చేయడంలేదని, తనకు కుదిరితే తప్పకుండా సినిమా చేస్తానని, ఈ సినిమానే నా ప్రాణమని ఈ సందర్భంగా బండ్ల గణేష్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు