దర్శకుడు హరీష్ శంకర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఉస్తాద్ తో లక్ష్యాన్ని సాధిస్తాడా?

టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్( Harish Shankar ) గురించి మనందరికీ తెలిసిందే.హరీష్ శంకర్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్( Mr.

Bachchan ).ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.

విడుదలకు ముందు మిస్టర్ బచ్చన్ మీద అతి నమ్మకంతో ఓవర్ అటెన్షన్ తెచ్చుకోవాలని ప్రయత్నించిన హరీష్ శంకర్ అదికాస్త రివర్స్ కావడంతో బయట కనిపించడం లేదు.కానీ హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయని చెబుతున్నారు.

కానీ ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న ఫలితాలను చూస్తే ఆ విషయం క్లారిటీగా అర్థమవుతోంది.

Advertisement

ఒకవేళ ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ వీకెండ్ కలెక్షన్ల నుంచి మేజిక్ ఆశించలేం.దానికి తోడు నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ( TG Vishwa Prasad )స్క్రిప్ట్ స్టేజిలోనే పొరపాట్లు జరిగాయని, సెకండాఫ్ లో హెచ్చు తగ్గులు ఉన్నాయని ఓపెన్ గా చెప్పేయడం జరిగిందేమిటో తేటతెల్లం చేసింది.కాగా ప్రస్తుతం హరీష్ శంకర్ పై రెండు ఒత్తిళ్లు ఉన్నాయి.

మొదటిది ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ).ఇదీ రీమేకే.విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా వచ్చింది.

థియేటర్ లో ఆడలేదు కానీ అమెజాన్ ప్రైమ్ లో బోలెడు మంది చూసేశారు.ఇప్పటికీ అందుబాటులో ఉంది.

అయినా సరే ఒరిజినల్ వెర్షన్ ని గుర్తుకరానంత గొప్పగా రీమేక్ చేస్తానని పలు సందర్భాల్లో నొక్కి మరీ వక్కాణించారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అచ్చం మిస్టర్ బచ్చన్ కు చెప్పినట్టే.అలాంటప్పుడు ఉస్తాద్ మీద కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సందేహం రావడం సహజం.షూటింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి స్క్రిప్ట్ ని మరోసారి పునఃసమీక్షించుకోవడం అవసరం.

Advertisement

రెండోది రామ్ తో ప్రాజెక్టు.ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ రూపంలో హ్యాట్రిక్ డిజాస్టర్లు చూసిన రామ్ సెలక్షన్ పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తమ హీరో ఎనర్జీని చేతులారా వృధా చేస్తున్నారని దర్శకుల మీద మండిపడుతున్నారు.ఇప్పుడీ కాంబో ఉంటుందో లేదోననే అనుమానాలు కొందరిలో తలెత్తుతున్నాయి.

హరీష్ మాత్రం ఫ్యాన్ స్పీడ్ అయిదులో తిరిగేంత గొప్ప కథని సిద్ధం చేస్తానని అన్నారు.అదే నిజమైతే అంచనాలకు మించిన స్టోరీ రెడీ చేయాలి.

మరి ఈ ఒత్తిడులను ఎదుర్కొని హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో లక్ష్యాన్ని సాధిస్తారో లేదో చూడాలి మరి.

తాజా వార్తలు