Sabja Seeds : మొటిమలను త‌రిమికొట్టి క్లియర్ స్కిన్ ను అందించే సబ్జా గింజలు.. ఎలా వాడాలంటే?

సబ్జా గింజలు( Sabja Seeds )వేసవికాలంలో చాలా మంది వీటిని నిత్యం తీసుకుంటారు.

ఒంట్లో వేడి తగ్గడానికి, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సబ్జా గింజలను మజ్జిగ, కొబ్బరినీళ్లు లేదా నార్మల్ వాటర్ లో కలిపి తీసుకుంటూ ఉంటారు.

ఆరోగ్యపరంగా సబ్జా గింజలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా సబ్జా గింజలు అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా మొటిమలను మాయం చేయడానికి, ముడతలు దరి చేరకుండా అడ్డుకట్ట వేయడానికి సబ్జా గింజలు ఉపయోగపడతాయి.మరింతకీ సబ్జా గింజలు చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

How To Use Sabja Seeds For Clear And Glowing Skin

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు మరియు అరకప్పు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి.అలాగే కొన్ని ఫ్రెష్ గులాబీ రేకులు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( Milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

How To Use Sabja Seeds For Clear And Glowing Skin
Advertisement
How To Use Sabja Seeds For Clear And Glowing Skin-Sabja Seeds : మొటిమ

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే మీ చర్మంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

సబ్జా గింజల్లో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపుతాయి.చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి.మొటిమలను తరిమి కొడతాయి.

క్లియ‌ర్ స్కిన్ ను అందిస్తాయి.అలాగే సబ్జా గింజల్లో ఉండే విటమిన్ ఈ ముడతలు, చర్మం సాగడం, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వ‌ర‌గా దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే గులాబీ రేకులు, పాలు, అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

గ్లోయింగ్ గా మెరిపిస్తాయి.అందమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తాయి.

Advertisement

తాజా వార్తలు